Credit Card: క్రెడిట్ కార్డు బిల్లింగ్ తేదీతో ఇబ్బంది పడుతున్నారా.. మీకోసమే రిజర్వు బ్యాంక్ కొత్త వెసులుబాటు..

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ విషయంలో అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంచారు. ఎందుకంటే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వాటిని జారీ చేసే సమయంలోనే బిల్లింగ్ తేదీని నిర్ణయిస్తాయి.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లింగ్ తేదీతో ఇబ్బంది పడుతున్నారా.. మీకోసమే రిజర్వు బ్యాంక్ కొత్త వెసులుబాటు..
Credit Card
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 28, 2022 | 4:37 PM

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ విషయంలో అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంచారు. ఎందుకంటే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వాటిని జారీ చేసే సమయంలోనే బిల్లింగ్ తేదీని నిర్ణయిస్తాయి. అయితే.. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఈ తేదీని ఒకసారి మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తుండగా.. మరికొన్ని సంస్థలు నిరాకరిస్తున్నాయి. ఇలాంటి సందర్బంలో అనేక మంది వినియోగదారులు తమ కార్డులను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన కార్డు రూల్స్ ప్రకారం జూలై 1,2022 నుంచి తమ బిల్లింగ్ సైకిల్ మార్చుకునేందుకు ఒక్కసారి అవకాశం అందుబాటులో ఉంటుంది.

రెండు బిల్లింగ్ లకు మధ్య ఉండే 30 రోజుల కాలాన్ని బిల్లింగ్ సైకిల్ అని అంటారు. ఈ సైకిల్ పూర్తయిన 15 నుంచి 25 రోజుల్లోపు వారు తమ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలోపు వినియోగదారులు వాడుకున్న మెుత్తానికి సంబంధించిన బిల్లును చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు, వడ్డీ ఉండదు. అదే సమయం దాటిన తరువాత చేసే చెల్లింపులపై సదరు క్రెడిట్ కార్డ్ సంస్థ వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజు విధిస్తాయి. ఇలా చేయటం వల్ల వినియోగదారుల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అందువల్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు సకాలంలో చెల్లింపులు చేసేందుకు వీలుగా తమ బిల్లింగ్ తేదీని మార్చుకోవటం ఉత్తమమైనది, ప్రయోజనకరమైనదిగా చెప్పుకోవాలి.