Home Loan: సొంతిల్లు కొనుక్కోవాలని ఉందా.. అయితే తక్కువ రేటుకు హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే..

Home Loan: చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు సొంతిల్లు అనేది జీవితకాల కల అని చెప్పుకోవాలి. తమకు వచ్చే ఆదాయంతో ఏ బ్యాంక్ లోనో తీసుకుని ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటుంటారు.

Home Loan: సొంతిల్లు కొనుక్కోవాలని ఉందా.. అయితే తక్కువ రేటుకు హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే..
Home
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 28, 2022 | 4:12 PM

Home Loan: చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు సొంతిల్లు అనేది జీవితకాల కల అని చెప్పుకోవాలి. తమకు వచ్చే ఆదాయంతో ఏ బ్యాంక్ లోనో తీసుకుని ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి వారికి ప్రస్తుతం అనేక బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్టిట్యూషన్లు ఆకర్షిణీయమైన రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఇలా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవటం వల్ల వారి కల నెరవేరటంతో పాటు అదనంగా టాక్స్ మినహాయింపులు కూడా వస్తాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్-80C, 80EE, 24ల కింద ఈ మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. మెుత్తం నిర్మాణ వ్యయంలో కేవలం 10-20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాక.. ఆ మిగిలిన మెుత్తాన్ని హౌసింగ్ లోన్ రూపంలో పొందవచ్చు. ఇందుకోసం సదరు వ్యక్తులు మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం కలిగి ఉండాలి. అలాంటప్పుడు రుణం సులువుగా, సరసమైన ధరకు, వేగంగా లభిస్తుంది. ఒక వేళ వినియోగదారులు లోన్ ఈఎంఐలను చెల్లించలేకపోతే సదరు బ్యాంక్, ఫైనాన్స్ సంస్థ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల వినియోగదారులు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాలి.

బ్యాంకుల్లో రేట్లు ఇలా..

లోన్ సమయంలో వడ్డీ రేటు, కాల పరిమితి, చెల్లించాల్సిన ఈఎంఐ, ఇతర ఛార్జీలు, షరతులను తప్పక తెలుసుకోవాలి. సరిపడా ఆదాయం లేని వారు జాయింట్ హోమ్ లోన్ తీసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌బీఐ – 6.65%, ఐడీబీఐ బ్యాంక్ – 6.75%, సెంట్రల్ బ్యాంక్ – 6.85%, పీఎన్‌బీ – 6.9%, బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.9%, బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.9%, యూకో బ్యాంక్ – 6.9%, యూనియన్ బ్యాంక్ – 6.9%, కెనరా బ్యాంక్ – 7.05%, ఐసీఐసీఐ బ్యాంక్ – 7.10% రేట్లకు హోమ్ లోన్ అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫైనాన్స్ కంపెనీల్లో ఇలా..

బజాజ్ ఫిన్‌సర్వ్‌ 6.75% నుంచి ప్రారంభమవుతుండగా.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ 6.9% ఉంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌ 6.99 % రేటుకు.. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ 7% నికి గృహ రుణాలు అందిస్తున్నాయి. టాటా క్యాపిటల్‌ 7.15%.. జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 7.24%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 7.6%, ఆదిత్య బిర్లా, రిలయన్స్ హోమ్, పిరమాల్ క్యాపిటల్‌ వంటి కంపెనీలు 9% వడ్డీ రేటుకు హౌసింగ్ లోన్స్ అందిస్తున్నాయి.