Air Asia: విమాన టిక్కెట్ బుకింగ్ లపై 50% పన్ను తగ్గింపు.. ఆలా చేస్తేనే ఆఫర్ చెల్లుబాటు
ఎయిర్ ఏషియా ఇండియా విమాన బుకింగ్‌లపై 50% పన్ను తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ టాటా గ్రూప్ కొత్త సూపర్ యాప్ టాటా న్యూ ద్వారా బుకింగ్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 30, 2022 వరకు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని....
ఎయిర్ ఏషియా ఇండియా విమాన బుకింగ్‌లపై 50% పన్ను తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ టాటా గ్రూప్ కొత్త సూపర్ యాప్ టాటా న్యూ ద్వారా బుకింగ్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 30, 2022 వరకు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో సెప్టెంబర్ 30 వరకు విమానాల కోసం బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా రివార్డు పాయింట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కస్టమర్లతో పాటు, ప్రతి బుకింగ్‌కు కూడా రివార్డ్ పాయింట్లు లభిస్తాయని, వీటిని షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చని ఎయిర్‌లైన్ తెలిపింది. ఎయిర్ ఏషియాలో 83.67% వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉంది. ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా సన్స్ 83.67% కలిగి ఉంది. మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్‌ఏషియా ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (AAIL) ఎయిర్‌లైన్‌లో మిగిలిన వాటాను కలిగి ఉంది.
టాటా న్యూ ఒక రకమైన సూపర్ యాప్. టాటా బ్రాండ్‌లన్నింటినీ ఒకే యాప్‌లో తీసుకొచ్చారు. ఇందులో ఎయిర్ ఏషియా, బిగ్ బాస్కెట్, కోర్మా, ఐహెచసీఎల్, క్యుమిన్, స్టార్ బక్స్, టాటా1 ఎంజీ, టాటా క్లిక్, టాటా ప్లే, వెస్టసైడ్ వంటి అన్ని బ్రాండ్‌ల నుంచి షాపింగ్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి