Weight Loss Tips: మీరు సులువుగా బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలు సూపర్..!
Weight Loss Tips: ఈ రోజుల్లో బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా ఉండొచ్చు. ఈ పరిస్థితిలో సులువుగా బరువు
Updated on: May 28, 2022 | 1:32 PM

ఈ రోజుల్లో బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా ఉండొచ్చు. ఈ పరిస్థితిలో సులువుగా బరువు తగ్గడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇది మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు, వేగంగా పని చేయగలుగుతారు.

ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలు తాగకూడదు. దీని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. జీర్ణవ్యవస్థ అనారోగ్యకరంగా ఉంటుంది. తలనొప్పి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం మానుకోండి.

ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. అల్పాహారం సమయంలో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వీటిని తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనితో మీరు ఎక్కువగా ఆహారం తీసుకోరు.

మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీని వల్ల జీవక్రియ సక్రమంగా ఉంటుంది. శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత 30 లేదా 15 నిమిషాలు నడవండి. ఉదయాన్నే వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్, రోప్ జంపింగ్ వంటి కొన్ని యాక్టివిటీలు చేస్తే మంచిది.



