Tomatoes Theft: కూరగాయల మార్కెట్‌లో టమోటాలు చోరీ .. దొంగతనం చేసినవారిని చితకబాదిన స్థానికులు

తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు.

Tomatoes Theft: కూరగాయల మార్కెట్‌లో టమోటాలు చోరీ .. దొంగతనం చేసినవారిని చితకబాదిన స్థానికులు
Tomatoes Theft
Follow us

|

Updated on: May 28, 2022 | 3:44 PM

Tomatoes Theft: దొంగతనాలు ఎక్కువగా బంగారం కోసమో, డబ్బు కోసమో జరుగుతుంటాయి. ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి, షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన చోరీ అందరిని విస్మయానికి గురిచేసింది. ఎమ్మిగనూరు వ్యవసాయ కూరగాయల మార్కెట్‌లో టమోటా బాక్సులు మాయమయ్యాయి. చివరికి దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను పట్టుకుని స్థానికులు చితకబాదారు.

తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాజాగా వ్యవసాయా మార్కెట్ లోపల కూరగాయలు వేలం పాట నిర్వహిస్తుండగా, అదునుగా భావించిన టమోటా దొంగలు ఓ ముఠాగా ఏర్పడి, మార్కెట్‌లో రైతుల టమాట బాక్స్‌లు ఎత్తుకెళ్తున్నారు. ఇది గమనించిన స్థానికులు.. ఇద్దరికి దేహశుద్ధి చేశారు. అనంతరం దొంగలను మందలించి వదిలివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..