Amalapuram Tension: కోలుకుంటున్న కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అవస్థలు

కోనసీమ జిల్లా ముఖ్య పట్టణంఅమలాపురంలో సాధారణ పరిసస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసులు పట్టణంలో పహారాకాస్తున్నారు.

Amalapuram Tension: కోలుకుంటున్న కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అవస్థలు
Amalapuram Tension
Follow us
Surya Kala

|

Updated on: May 26, 2022 | 2:00 PM

Amalapuram Tension: కోనసీమ(Konaseema) కోలుకుంటున్నది. జిల్లా సాదన సమితి ఘర్షణల నేపధ్యంలో జె.ఎసి నేతలు సహా సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అమలాపురం, రావులపాలెం లో పోలీసులు మోహరించారు. జిల్లా పేరు మార్పు కు సంబంధించిన అభ్యంతరాల స్వీకరిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కార్యలయంలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేశారు. ఘర్షణల నేపథ్యంలో కలెక్టరేట్ వద్ధ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు: కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం అమలాపురంలో సాధారణ పరిసస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసులు పట్టణంలో పహారాకాస్తున్నారు. విధ్వంసాలకు పాల్పడిన వారి కోసం దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇప్పటికే 72 మందిని గుర్తించారు. వారిలో 46 మంది అరెస్టు చేశారు. ప్రాథమికంగా సుమారు 400 మందిపై కేసులు నమోదు చేశారు. అమలాపురంలో రెండో రోజు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. సోషల్ మీడియా ద్వారా ఆందోళనకు పిలుపు ఇవ్వకుండా నెట్ సేవలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.

ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణకు డిమాండ్: కోనసీమ జిల్లా రెండు రోజులుగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్క్ ఫ్రొం హోమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పూర్తిగా నిలిచిపోయిన బ్యాంకింగ్ సేవలతో పాటు ఆన్లైన్ సేవలు ఫోన్ పే గూగుల్ పే పేటీఎం సర్వీసులు. కోనసీమలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమలాపురం రూరల్ మండల ఇందుపల్లిలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రెండు రోజులుగా నెట్ లో పని చేయక తమ తమ కంపెనీల నుండి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి అని అప్డేట్ చేయకపోవడం నేరుగా కంపెనీలకు వచ్చేయాలని పిలుస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. తొందరగా తమకు ఇంటర్నెట్ సేవలు తేవాలని కోరుతున్నారు. అయితే కోనసీమ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకూ సేవలు నిలిపివేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా హాస్పటల్లో మెడికల్ bills, టాబ్లెట్స్ తీసుకునేందుకు కూడా కనీసం ఫోన్ పే గూగుల్ పే పేటీఎం యాప్స్ కూడా పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చే పేషెంట్ ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా ఇంటర్నెట్ సేవలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్:  కోనసీమ జిల్లాలో అల్లర్లను అదుపు చేయడం కోసం విధించిన 144 సెక్షన్ విధించారు. దీంతో ఇంటర్ విద్యార్థులనుంచి డెలివరీ బాయ్స్ వద్ద నుంచి పోలీసులు ఫోన్ లు తీసుకున్నారు. తమ ఫోన్ల ను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవడం కోసం యువత క్యూ కట్టింది. నిన్న జరిగిన సంఘటనతో అభం శుభం .తెలియని..యువతను టార్గెట్ చేసి ఫోన్ లు స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న వానపల్లికి చెందిన పవన్ అనే విద్యార్థిని పోలీసులు కొట్టినల్టు తెలుస్తోంది. అంతేకాదు పవన్ నుంచి పోలీసులు ఫోన్ తీసుకున్నారు.

అంబేడ్కర్ పేరు కొనసాగించాలని డిమాండ్: మరోవైపు కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు కోనసీమ జిల్లాకు ఉంచాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజన బహుజన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్ పేరును వివాదాస్పదం చెయ్యొద్దు అని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మనువాద మతోన్మాద ఉన్మాద శక్తుల ఉచ్చులో పడొద్దు అని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. అంబేద్కర్ పేరుతో ఉన్న కోనసీమ జిల్లానీ కొనసాగించాలని డిమాండ్ చేశారు, అంతేకాదు త్వరలోనే చలో విజయవాడ కి పిలుపునిచ్చారు.అంబేద్కర్ అందరివాడు రాజకీయ పార్టీలు రాజకీయం చేయకూడదని సూచించారు.అందరూ సమన్వయం పాటించాలని కోరారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..