Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నారాయణుడు నడయాడిన గిరి.. ఆధ్యాత్మిక సిరి.. శ్రీవారి పాద ముద్రల నారాయణ గిరి.. తిరుమలలో దర్శించాల్సిన ప్రాంతమిది!

శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం కనిపించే ప్రాంతాన్ని నారాయణ పాదం అని అంటారు. నారాయణగిరి పాదాలకు పాద పూజ, ఛత్రస్థాపన వంటి ఉత్సవాలను నిర్వహిస్తారు.

Tirumala: నారాయణుడు నడయాడిన గిరి.. ఆధ్యాత్మిక సిరి.. శ్రీవారి పాద ముద్రల నారాయణ గిరి.. తిరుమలలో దర్శించాల్సిన ప్రాంతమిది!
Srivari Padalu In Narayanag
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 11:52 AM

Tirumala: శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. సాక్ష్యాత్తు వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శించుకున్నట్లు భావిస్తారు. అయితే శ్రీవారి మహామూర్తిని శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు.. పాదాలను వీక్షించడం మహాభాగ్యంగా భావిస్తారు. స్వామివారి నిజపాద దర్శనం కోసం భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అంతటి దివ్యపాదాలు తిరుమలలో అలిపిరి మెట్లు దగ్గర ఉంటాయి. అంతేకాదు తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం(Narayana Padalu) కూడా ఉంది. ఈ స్థలం విశిష్టత, పూజ తదితర విశేషాలను తెలుసుకుందా.

శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం కనిపించే ప్రాంతాన్ని నారాయణ పాదం అని అంటారు. నారాయణగిరి పాదాలకు ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు.  అయితే .. పాద పూజ, ఛత్రస్థాపన వంటి ఉత్సవాలను  నిర్వహిస్తారు. ప్రస్తుతం నారాయణ పాదాలు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం, ద్వాదశి తిథి రోజున నారాయణ గిరిలో శ్రీపాద పూజ, ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల గిరి పై ఆరోజున శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిసిన అనంతరం అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను, బంగారు బావి తీర్ధాన్ని తీసుకుని  మంగళ వాద్యాలతో  నారాయణ గిరి బయలుదేరుతారు.

ఇవి కూడా చదవండి

మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి వంటి విధులను నిర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వస్తారు, అనంతరం ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తారు. వనభోజనం కార్యక్రమం నిర్వహించిన అనంతరం శ్రీవారి మహాద్వారానికి చేరుకుంటారు.

కోనేటిరాయుడు పాదాలు ఇన్ని రకాలుగా పూజలను అందుకుంటున్నాయి. తాళ్ళపాక అన్నమయ్య వంటి వారితో కీర్తింపడ్డాయి శ్రీవారి దివ్యపాదాలు. నిజానికి శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే భక్తులు భావిస్తారు. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే.. యన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి