Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Jayanti 2022: సోమవతి అమావాస్య రోజున శని జయంతి .. ఈ వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు మీ సొంతం

ఈ ఏడాది శని జయంతి మే 30వ తేదీ సోమవారం వచ్చింది. ఈరోజున పూజాదికార్యక్రమాలతో పాటు దానం చేయడం వలన ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. నిజానికి, హిందూ మతంలో, ఆరాధనతో పాటు దాతృత్వానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Shani Jayanti 2022: సోమవతి అమావాస్య రోజున శని జయంతి .. ఈ వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు మీ సొంతం
Shani Jayanti 2022
Follow us
Surya Kala

|

Updated on: May 26, 2022 | 11:47 AM

Shani Jayanti 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యని శని జయంతిగా జరుపుకుంటారు. శనిదేవుడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య నాడు జన్మించాడని, అందుకే ఈ రోజును శని జయంతి అని అంటారు. శనీశ్వరుడికి కోపం ఎవరికైనా ఇబ్బందులను కలిగించగలదు. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రజలు అనేక పూజలను చేస్తారు. శనిదేవుని అనుగ్రహం ఉంటే ఎవరికైనా సమస్యలు ఉండవు. సుఖ సంతోషాలతో జీవిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. శని జయంతి రోజున పూజించవచ్చు. శని జయంతి రోజున శనీశ్వరుడిని పూజిస్తే.. బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఏడాది శని జయంతి మే 30వ తేదీ సోమవారం వచ్చింది. ఈరోజున పూజాదికార్యక్రమాలతో పాటు దానం చేయడం వలన ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. నిజానికి, హిందూ మతంలో, ఆరాధనతో పాటు దాతృత్వానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని జయంతి నాడు మీరు ఏయే వస్తువులను దానం చేయవచ్చు, శనీశ్వరుడి అనుగ్రహం ఎలా పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం..

శని జయంతి.. శుభ సమయం: ఈ సంవత్సరం శని అమావాస్య  మే 30వ తేదీన వచ్చింది. శుభ సమయం మే 29 మధ్యాహ్నం 2.54 నుండి ప్రారంభమవుతుంది. మే 30వ తేదీ మరుసటి రోజు సాయంత్రం 4.59 గంటల వరకు శని అమావస్య కొనసాగుతుంది. ఈ ఏడాది శని జయంతి సోమవారం వస్తుంది కనుక ఈ అమావాస్యని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. శని జయంతి,  సోమవతి అమావాస్య కలిసి రావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా ఈ రెండు పర్వదినాలు కలిసి దాదాపు 30 సంవత్సరాల తర్వాత వచ్చిందని అంటున్నారు.

శని జయంతి రోజున దానంచేయాల్సిన వస్తువులు: 

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వులు: శని దేవుడికి నల్లని దానం చేయడం చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి అనంతరం పూజాదికార్యక్రమాలు నిర్వహించి నల్ల నువ్వులను దానం చేయాలి. గుడిలో పూజ చేసిన అనంతరం శనీశ్వరుడికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించి.. అనంతరం వాటిని ప్రజలకు పంచండి.

బెల్లం దానం: శని దేవుడికి బెల్లం నైవేద్యాన్ని సమర్పించడం కూడా మంచిదని భావిస్తారు. ఈ రోజున బెల్లం కూడా దానం చేయడం అత్యంత శ్రేష్టం. ఆలయానికి వెళ్లి శని దేవుడికి బెల్లం సమర్పించి.. అనంతరం ఆ బెల్లాన్ని పేదలకు దానం చేయాలి.

నల్లని బట్టల దానం: నలుపు రంగు శని దేవుడికి ప్రీతికరమైనది. శనీశ్వరుడి అనుగ్రహం కోసం మీరు ఎవరికైనా నల్లని బట్టలు దానం చేయడం ద్వారా  శుభఫలితాలను పొందవచ్చు. అయితే నల్లని బట్టలు తీసుకుని ముందుగా శని దేవుడికి సమర్పించండి. అనంతరం వాటిని పేదవారికి దానం చేయడం వలన విశిష్ట ఫలితం అందుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)