Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips in Telugu: ఆర్ధిక ఇబ్బందులా.. అయితే రూపాయితో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్న లోపాలు (కుండలి దోషం), వాస్తు ప్రకారం పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ఈ లోపాలను తొలగించడానికి కొన్ని ప్రభావవంతమైన చర్యలు సూచించబడ్డాయి.

Astro Tips in Telugu: ఆర్ధిక ఇబ్బందులా.. అయితే రూపాయితో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2022 | 12:22 PM

Astro Tips in Telugu: కొన్నిసార్లు కొంతమంది తమ జీవితంలో ఎంత కష్టపడినా, అంకితభావంతో పనిచేసినా అనుకున్నది  సాధించలేరు. దీంతో తమకు కావాల్సినవి దక్కలేదనే ఫీలింగ్ వారిలో ఉంటుంది. వాస్తు , జ్యోతిష్యంలో కొన్ని దోషాలను నివారించే రకాల సూచనలు చూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్న లోపాలు ( Kundali Dosh), వాస్తు ప్రకారం పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ఈ లోపాలను తొలగించడానికి కొన్ని ప్రభావవంతమైన చర్యలు  సూచించబడ్డాయి. వీటిని అవలంబించడం ద్వారా జీవితంలో లేదా ఇంటిలో డబ్బుతో పాటు (Jyotish tips for money)  అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీ జేబులో ఒక్క రూపాయి నాణెం కూడా మీ అదృష్టాన్ని మార్చగలదని మీకు తెలుసా. అవును ఒక రూపాయి నాణెం అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఈ కథనంలో, ఒక రూపాయి నాణెంకు సంబంధించిన జ్యోతిష్యంలో  సమర్థవంతమైన చర్యల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. వాటిని పాటించడం కూడా చాలా సులభం.

కెరీర్ కోసం: కష్టపడి పనిచేసినా కెరీర్‌లో అనుకున్న స్థానం దక్కడం లేదని అనిపిస్తే ఒక్క రూపాయి నాణెం తీసుకుని నెమలి ఈకతో పాటు జేబులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అదృష్టంలో మార్పు వస్తుందని, కెరీర్‌లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. దీనితో పాటు అభివృద్ధి పురోగతిలో కొత్త కోణాలు తెరవబడతాయి.

ఆర్థిక కొరత: మీరు ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే..  లక్ష్మీ దేవి దగ్గర మీరు ఒక రూపాయి నాణెంని పెట్టి పూజించాలి. ఒక పెద్ద మట్టి దీపం తీసుకుని అందులో ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఈ సమయంలో దీపపు కుందెలో ఒక రూపాయి నాణెం వేయాలని గుర్తుంచుకోండి. ఈ పరిహారం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. ఆమె అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంటిలో ఏర్పడిన కష్టాలు తొలగించడానికి:  చాలా సందర్భాల్లో, జీవితంలో సమస్యలు లేదా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ ఇబ్బందులు జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతాయి. అనేక కష్ట నష్టాలను కలిగిస్తాయి. వాటిని బియ్యం, ఒక రూపాయి నాణెంతో తీసుకోవచ్చు. ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకుని అందులో ఒక రూపాయి నాణెం వేయండి. పూజ చేసి ఇంటికి వచ్చిన ఏ సన్యాసికైనా ఆ బియ్యాన్ని దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)