Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అలిపిరి దగ్గర తన భక్తుడి కోసం స్వయంగా తన పాదాలను శ్రీవారు ఎందుకు ఏర్పాటు చేశారంటే..

తిరుమల కొండమీదకు కాలినడకన అలిపిరి ప్రదేశంనుంచి కూడా వెళ్లారు. ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి.

Tirumala: అలిపిరి దగ్గర తన భక్తుడి కోసం స్వయంగా తన పాదాలను శ్రీవారు ఎందుకు ఏర్పాటు చేశారంటే..
Alipiri Srivari Padalu
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2022 | 2:10 PM

Tirumala: తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు కాలినడకన వెళ్లారు. అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ రెండు మార్గాల్లో కాలినడకన కొండపైకి చేరుకుంటారు. అయితే భక్తులు కాలినడకన అలిపిరి నుంచి వెళ్ళడానికి మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు అక్కడ శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అక్కడ స్వామివారి పాదాలకు పూజలు నిర్వహించి.. కొబ్బరికాయను కొట్టి.. తమ మొక్కును తీర్చుకుంటూ.. మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఓ కథనం. వివరాల్లోకి వెళ్తే..

తిరుమల కొండమీదకు కాలినడకన అలిపిరి ప్రదేశంనుంచి కూడా వెళ్లారు. ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో  కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని ఇరువురు శ్రీవారి చేసేవారట. అయితే స్వామి వారి దర్శనం ప్రొద్దున్న, సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనం అవుతోందని తిరుమలనంబి, రామానుజాచార్యులు ఇద్దరూ బాధ పడేవారట. అప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి  తిరుమల నంబి కలలో కనబడి అభయం ఇచ్చారంట. నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని చెప్పారట.

అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు.. నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్ళే ముందు కనిపించే పాదాలు.  శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండకింద ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

పాదాల మండపం: ఇక అలిపిరి నుంచి కాలి నడక మార్గంలో వెళ్ళేవారికి అక్కడ కనిపిచే మండపం.. పడాల మండపం అని అంటారు. దీనినే పాదాల మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపం క్రీ.శ .1628 కాలం నాటిది. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉంటాయి. ఇక్కడ మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక శిలగా మరిపోయాడట.

పిండితాళిగలు: తెలుగువారికి ముఖ్యమైన శ్రావణ శనివారంరోజున ఉపవాసం చేయడం చేస్తారు. ఆరోజున స్వామివారికి పిండితాళిగలు వేయడం సంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలో హరిజనులు ఇంటిలో, కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుండి ఒకరు, కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు.

పాదరక్షలు: ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ.. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం. అందుకనే అక్కడ పూజా మందిరంలో పెట్టిన పాదరక్షలు అరిగిపోతాయని భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..