- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips In Telugu these habits can destroy your married life
Vastu Tips: ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి.. ఇవి మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపిస్తాయి..
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, పడకగదిలో కొన్ని వస్తువులను దూరంగా ఉండాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
Updated on: May 26, 2022 | 3:13 PM

కొన్నిసార్లు జంటలు ఆఅకారణంగా గొడవ పడుతుంటారు. దీనికి కారణం వాస్తు దోషం కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో కొన్ని వస్తువులను ఉంచడం మానుకోవాలి. అవి భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.

మంచం కింద చీపురు ఉంచవద్దు - మీరు మంచం క్రింద చీపురుని పెట్టే అలవాటుంది ఉంటె వెంటనే మానుకోండి.వాస్తు ప్రకారం. ఇలా చేయడం వలన ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మంచం ముందు అద్దం ఉండకూడదు - వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం ముందు అద్దం పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య గొడవలు జరగడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

అక్వేరియం లేదా ఫౌంటెన్ ఉంచవద్దు - చాలా మంది తమ గదిని అలంకరించుకోవడానికి అక్వేరియం లేదా ఫౌంటెన్‌ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు చిట్కాలను పాటించాల్సి ఉంది. లేదంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ముఖ్యంగా పడకగదిలో అక్వేరియం లేదా ఫౌంటెన్‌ను ఉంచవద్దు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.




