Tirumala: హనుమాన్ జన్మస్థలంలో భూమి పూజ చేసి మూడు నెలలు.. ఇంకా ప్రారంభం కాని నిర్మాణ పనులు..

గ‌త ఫిబ్ర‌వ‌రి 16న తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ వ‌ద్ద అంగ‌రంగ వైభవంగా స్వామీజీలు, పీఠాధిప‌తుల స‌మ‌క్షంలో భూమిపూజ నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై కొంద‌రు పిటిష‌న‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించారు.

Tirumala: హనుమాన్ జన్మస్థలంలో భూమి పూజ చేసి మూడు నెలలు.. ఇంకా ప్రారంభం కాని నిర్మాణ పనులు..
Hanuman Birth Place
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 26, 2022 | 1:17 PM

Tirumala: తిరుమ‌ల‌లో హ‌నుమ జ‌న్మ‌స్థ‌ల (Hanuman Birth Place) అభివృద్ధికి భూమిపూజ చేసి మూడు నెల‌లు దాటుతున్న ఇంకా ప‌నులు ప్రారంభం కాలేదు. స్వామీజీలు, పీఠాధిప‌తుల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా భూమిపూజ చేసిన‌ప్ప‌టికీ ప‌నుల ప్రారంభంలో టీటీడీ(TTD) ఆల‌స్యం చేస్తోంది. ఇంత‌కూ ప‌నుల నోచుకోకపోవ‌డాని గ‌ల కార‌ణాలేంటీ? ప‌నుల ప్రారంభంపై టీటీడీ ఏమి చెబుతోంది? కోర్టు అడ్డంకుల‌తో టీటీడీ వెన‌క‌డువేస్తోందా?

హ‌నుమంతుడు తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ‌లోనే జ‌న్మించాడ‌ని గ‌త సంవ‌త్స‌రం శ్రీ‌రామ న‌వ‌మికి టీటీడీ ప్ర‌క‌టించింది. టీటీడీ ఏర్పాటు చేసిన పండిత ప‌రిష‌త్ పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాల‌ను అధ్య‌య‌నం చేసి ఆధారాల‌తో ఆకాశ‌గంగే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తేల్చారు. దీంతో టీటీడీ అధికారులు హ‌నుమ జ‌న్మ‌స్థ‌లంగా ఆకాశ‌గంగ తీర్థాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో క‌ర్ణాట‌క‌కు చెందిన హ‌నుమ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు నిర్వాహ‌కుడు గోవిందానంద స‌ర‌స్వ‌తి టీటీడీ ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క‌ర్ణాట‌క పంపా క్షేత్రంలోని కిష్కింద క్షేత్ర‌మే హ‌నుమ జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని వాదిస్తూ వ‌చ్చారు. ఈ అంశంపై టీటీడీ పండితుల‌తో చ‌ర్చ‌కు వ‌చ్చి వాద‌న‌ల‌కు కూడా దిగారు. అయిన‌ప్ప‌టికీ టీటీడీ ఎక్క‌డ వెనక్కి త‌గ్గ‌కుండా ఆకాశ‌గంగ అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది.

హ‌నుమ జ‌న్మ‌స్థ‌ల అభివృద్ధికి దాత‌లు ముందుకు రావ‌డంతో టీటీడీ నిర్మాణ డిజైన్ల బాధ్య‌త‌ల‌ను ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయికి అప్ప‌గించింది. ఆయ‌న దాదాపు 6నెల‌లు శ్ర‌మించి ఆకాశ‌గంగ‌లో ప‌లు నిర్మాణాల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్లు రూపొందించారు. గ‌త ఫిబ్ర‌వ‌రి 16న తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ వ‌ద్ద అంగ‌రంగ వైభవంగా స్వామీజీలు, పీఠాధిప‌తుల స‌మ‌క్షంలో భూమిపూజ నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై కొంద‌రు పిటిష‌న‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా టీటీడీ అంజనాద్రిలో ఆంజనేయుడి జన్మస్థానం అభివృద్ధి పనులు చేస్తోందని పిటిషనర్ వాదించారు. దీంతో ఆకాశ‌గంగ‌లోని అభివృద్ధి ప‌నుల కొన‌సాగింపుపై కోర్టు స్టే విధించింది. ఆకాశ‌గంగ‌లో కొత్త‌గా నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని ఆదేశించింది. దీంతో ఆకాశ‌గంగ‌లో కొత్త‌గా నిర్మాణాలు చేప‌ట్ట‌డంలేద‌నీ, పర్యాటక ప్రాంతంగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు టీటీడీ కోర్టులో త‌మ వాదన‌ల‌ను వినిపించింది. కోర్టు స్టే విధించిన‌ప్ప‌టికీ టీటీడీ ఫిబ్ర‌వ‌రి 16న అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స్వామీజీలంద‌రూ హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం తిరుమ‌ల‌లోని అంజ‌నాద్రినేని న‌మ్ముతున్నామ‌ని ఏకాభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నేప‌థ్యంలో కోర్టు స్టే ఉండ‌టంతో ఆకాశ‌గంగ అభివృద్ధి ప‌నుల‌కు టీటీడీ డైలామాలో ప‌డిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భూమి పూజ చేసి దాదాపు 100 రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌నులు ప్రారంభం కాలేదు. ఆకాశ‌గంగ‌లో ప‌నుల ప్రారంభం కాక‌పోవడానికి డిజైన్లు పూర్తికాక‌పోవ‌డ‌మే కార‌ణంగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఆకాశ‌గంగ‌లో అభివృద్ధి ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన‌ట్లు త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయా? లేదా లేదా కోర్టు కేసు ముగిసే వ‌ర‌కు ప‌నులు ప్రారంభం కావో వేచి చూడాల్సి ఉంది.

Reporter: Anil, Tv9 Telugu

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?