Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా గనేశుడి అనుగ్రహం కోసం ఇంట్లో వెండి ఏనుగులను ఇలా ఏర్పాటు చేసుకోండి..
ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం శ్రేయస్కరమని శాస్త్రాలలో చెప్పబడింది. ఇది గణేశుడికి సంబంధించినది. అందుకనే ఏనుగు ఉన్న ఇంట్లో ఆ గజాననుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది నమ్మకం. కొంతమంది వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏనుగులను కూడా పూజిస్తారు.
Vastu Tips: జీవితంలో విజయం, ఆనందం సంపద కోసం.. సాధారణంగా ప్రతి ఒక్కరూ కృషితో పాటు ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా విజయం లభించదు.. మరికొందరికి లభించిన విజయం ఎక్కువ కాలం ఉండదు. అయితే జీవితంలో కష్టాల్లో, డబ్బు లేకపోవడం లేదా నష్టం చాలా బాధను కలిగిస్తుంది. డబ్బు కొందరి చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆర్ధిక ఇబ్బందులకు కారణం వాస్తు దోషం ఉండవచ్చని చాలామంది భావిస్తారు. అంతేకాదు వాస్తు దోషాల వల్ల శారీరక, మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. మీరు ఈ దోషాలను వదిలించుకోవడానికి అనేక చర్యలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అటువంటి నివారణ చర్యల్లో ఒకటి ఇంట్లో వెండి ఏనుగును ప్రతిష్టించడం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని విషయాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. అలాంటి వాస్తు నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడతాయి. ఇంట్లో వెండి ఏనుగును ఏర్పాటు చేయడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు వెండి ఏనుగు ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
వెండి ఏనుగు: ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం శ్రేయస్కరమని శాస్త్రాలలో చెప్పబడింది. ఇది గణేశుడికి సంబంధించినది. అందుకనే ఏనుగు ఉన్న ఇంట్లో ఆ గజాననుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది నమ్మకం. కొంతమంది వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏనుగులను కూడా పూజిస్తారు. ఏనుగు ఒక పెద్ద జంతువు, దానిని పెంచడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో.. మీరు ఇంట్లో వెండి ఏనుగును ఏర్పాటు చేసుకోవడం వలన శుభం పొందవచ్చు. ఇలా చేయడం వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. సహజ ఏనుగు ఎంత శుభాన్ని ఇస్తుందో.. వెండితో చేసిన ఏనుగు కూడా అంతే శుభాన్ని కలిగిస్తుంది.
ఇంట్లో వెండి ఏనుగును ఎక్కడ ఉంచాలంటే.. మీరు ఇంట్లో వెండి ఏనుగును ఉంచుకోవాలనుకుంటే, వాస్తు ప్రకారం అమర్చండి. వాస్తు ప్రకారం, మీరు దానిని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అదే వెండి ఏనుగును టేబుల్‌పై ఉంచితే.. ఆర్ధిక కష్టాలను తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంపదలు పొందడానికి, వెండి ఏనుగు మంచి పరిహారం అని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
ఇతర నివారణలు చర్యలు: 1. మీకు కావాలంటే.. మీ స్టడీ రూమ్‌లో వెండి ఏనుగును ఉంచుకోవచ్చు. ఏకాగ్రత పెరుగుతుందని, చదువులో మనసు కూడా నిమగ్నమై ఉంటుందని అంటున్నారు.
2. ఇంట్లో వెండి ఏనుగు నుండి కూడా అదృష్టం వస్తుంది. ఒక జత ఏనుగులను కొనుగోలు చేసి, వాటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద అమర్చండి.
3. భార్యాభర్తల మధ్య గొడవలు లేదా ఉద్రిక్త వాతావరణం ఉన్నట్లయితే.. వారు ఏనుగుల జంటను ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధంలో మాధుర్యాన్ని తీసుకురావచ్చు. అలాంటి వారు ఒక జత వెండి ఏనుగులను తెచ్చి పడకగదిలో ఏర్పాటు చేసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)