ఇక్కడ వైఫై గివ్‌ఫై లు ఉండవు.. మనసువిప్పి మాట్లాడుకోవడాలే..! కేఫ్‌ వినూత్న ప్రయత్నం..

ప్రస్తుత ప్రపంచమంతా ఇంటర్‌నెట్‌ మయం..అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ అనంత విశ్వాన్ని మనిషికి అందుబాటులోకి తీసుకొస్తుంది. వంటింట్లో చేసే వంటకాల నుంచి చదువులు, ఉద్యోగాలు అన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి.

ఇక్కడ వైఫై గివ్‌ఫై లు ఉండవు.. మనసువిప్పి మాట్లాడుకోవడాలే..! కేఫ్‌ వినూత్న ప్రయత్నం..
No Wifi
Follow us
Jyothi Gadda

|

Updated on: May 28, 2022 | 5:34 PM

ప్రస్తుత ప్రపంచమంతా ఇంటర్‌నెట్‌ మయం..అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ అనంత విశ్వాన్ని మనిషికి అందుబాటులోకి తీసుకొస్తుంది. వంటింట్లో చేసే వంటకాల నుంచి చదువులు, ఉద్యోగాలు అన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఇంటర్‌ నెట్‌ సౌకర్యం ఉంటే చాలు..భూమ్మీద ఎక్కడ ఉన్నా తమకు కావాల్సిన పని జరిపించేసుకోవచ్చు. ఈ క్రమంలోనే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఫ్రీ ఫైవై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులకు మాత్రమే కాదు, ప్రయాణ ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, కొన్ని షాపింగ్‌ కాంప్లెక్సులు, కొన్ని హోటల్స్‌ కూడా వినియోగదారుల సేవలకు గానూ ఉచిత వైఫైని అందిస్తుంటాయి. అందుకోసం ఇక్కడ ఫ్రీ వైఫై అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది ఓ కేఫ్‌ నిర్వాహకులు మాత్రం ఓ విచిత్ర బోర్డును ఏర్పాటు చేశారు. ఇచ్చట నో వైఫై ఓన్లీ talk to each other అంటూ స్పెషల్‌ నోటీస్‌ను అంటించారు. ఇది చూసిన కస్టమర్లు షాక్‌ అవుతున్నారు. ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో అదికాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఈ బోర్డు వెనుక అసలు కారణం తెలిస్తే మాత్రం మీరు కూడా ఆ కేఫ్‌ నిర్వాహకులను మెచ్చుకుంటారు…అదేంటంటే…

ఇదిగో..ఇక్కడ మీరు చూస్తున్న ఈ బోర్డు అదే..యూఎస్‌లోని ఓ కేఫ్‌లో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. అందులో ఇలా రాసి ఉంది..“మాకు వైఫై లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, అంతేకాదు, ఇది మిమల్నీ 1995లకు తీసుకెళ్తుంది”అని. ఇదే చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ నోటీస్‌ బోర్డు వెనుక గల కారణం ఏంటంటే..ప్రస్తుతం విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఇంటర్‌నెట్‌ సదుపాయంతో ప్రజలంతా తమ చుట్టు ఉన్నవారిని పట్టించుకోవటం లేదు. పక్కనున్న మనుషుల్ని కనీసం పలకరించుకునే తీరిక కూడా లేకుండా పోయింది. సాంకేతిక సాయంతో కనీసం కేఫ్‌లో ఆర్డర్‌ కూడా మనుషులు చేయటం లేదు. ఫోన్‌లోని మెనుని పైకి లాగడం, క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయటం, మనిషి జోక్యం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. అందుకే ఇలాంటి వింత నిర్ణయం తీసుకున్నామంటోంది కేఫ్‌.

ఇవి కూడా చదవండి

ఈ ఫోటోను ఇంద్రనీల్‌ ఘోష్‌ అనే యూజర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. నేను ఈ ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. మీరు దాని కోసం సిద్ధంగా ఉన్నారా..? అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.