Zomato Share: టొమాటో కంటే తక్కువ రేటుకే జొమాటో షేర్.. సంపద ఆవిరి చేస్తున్న న్యూ ఏజ్ టెక్ కంపెనీలు..
Zomato Share: జొమాటో షేర్ల కంటే టొమాటో ఖరీదు ఎక్కువని ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో జోక్ నడుస్తోంది. జొమాటో షేర్ తన గరిష్ఠ స్థాయి అయిన రూ.169.10 నుంచి పడిపోయి ప్రస్తుతం రూ.62.05 వద్ద ట్రేడవుతోంది.
Zomato Share: జొమాటో షేర్ల కంటే టొమాటో ఖరీదు ఎక్కువని ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో జోక్ నడుస్తోంది. జొమాటో షేర్ తన గరిష్ఠ స్థాయి అయిన రూ.169.10 నుంచి పడిపోయి ప్రస్తుతం రూ.62.05 వద్ద ట్రేడవుతోంది. Zomato, Nykaa, Paytm వంటి టెక్ స్టార్టప్‌ల షేర్లు పేలవమైన పనితీరును కనబరిచాయి. దీని వల్ల అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు సంపదను కోల్పోయారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి. ఈ సమయంలో అనేక మంది సంపద తుడిచిపెట్టుకుపోతోంది. న్యూ ఏజ్ టెక్ కంపెనీలు ఐపీవోలపై ప్రజలు అప్పట్లో ఎక్కువ మక్కువ చూపారు. కానీ.. సదరు కంపెనీల వ్యాల్యుయేషన్ ఖరీదైనదిగా ఉందని చాలా మంది అభిప్రాయపడటంతో సెబీ సైతం రంగంలోకి దిగింది. ఇలాంటి కంపెనీల లిస్టింగ్ విషయంలో అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆ తరువాత అనేక కంపెనీలు తమ ఇష్యూలను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఈ సమయంలో ఇష్యూ సైజ్ ను సైతం తగ్గించుకున్నాయి.
Nykaa, Zomato, Paytm వంటి గర్వించదగిన స్టార్టప్‌లు తమ లిస్టింగ్ ధర కంటే దాదాపు 50 శాతం తక్కువ రేటుకు ప్రస్తుతం ట్రేడింగ్ అవుతున్నందున ఇన్వెస్టర్ల సంపదను తగ్గించడాన్ని కొనసాగిస్తున్నాయని Avenor Capital వ్యవస్థాపకుడు, CEO బజాజ్ అన్నారు. భారత స్టార్టప్‌లు 2022లో ఇప్పటి వరకు దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2021-22లో అతిపెద్ద IPO రూ. 18,300 కోట్లకు One97 కమ్యూనికేషన్స్(Paytm) నుంచి వచ్చింది. జొమాటో (రూ. 9,375 కోట్లు), స్టార్ హెల్త్ (రూ. 6,019 కోట్లు), పిబి ఫిన్‌టెక్ (రూ. 5,710 కోట్లు), సోనా బిఎల్‌డబ్ల్యు (రూ. 5,550 కోట్లు), ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ-కామర్స్ (రూ. 5,350 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టాప్ 6 IPOల్లో నాలుగు న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీలు మార్కెట్ల నుంచి రూ.38,734 కోట్లను సమీకరించాయి. జాక్ మా నేతృత్వంలోని అలీబాబా, యాంట్ ఫైనాన్షియల్ Paytm మాల్ మాతృ యూనిట్ Paytm E-Commerce Pvt Ltd నుంచి తప్పుకోవటంతో దాని విలువ అమాంతం పడిపోయింది. Paytm E-commerceలో అలీబాబా (28.34 శాతం), యాంట్‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్ (14.98 శాతం) మొత్తం వాటాను రూ. 42 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. 2020లో దాని చివరి నిధుల సేకరణ సమయంలో కంపెనీ విలువ 3 బిలియన్ డాలర్ల ఉండగా ఇప్పుడు అది రూ. 100 కోట్లకు పడిపోయింది.