హైదరాబాద్లో ఇటీవల వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. యూసుఫ్ గూడ పరిధిలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసింది. ఓ వృద్ధుడు సకాలంలో స్పందించి కుక్కను వెళ్లగొట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.