Kamallamma Mysore Pak: వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి.. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా..
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి అంటే గుర్తొచ్చేది చేనేత.. ఇక్కడ నేతన్నల మగ్గాల నుంచి తయారయ్యే చేనేత చీరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. అయితే ఇక్కడ ఓ ఫుడ్ ఐటెం కూడా ఫేమస్ అన్న విషయం ఎంతమందికి తెలుసు.. అదే కమలమ్మ మైసూర్ పాక్.. వందేళ్ల క్రితం వెంకటగిరి రాజా కుటుంబం కోసం వారి కిచెన్ లో మొట్టమొదట తయారైన స్పెషల్ రెసిపీ అది. ప్రస్తుతం వీటికి డిమాండ్ మామూలుగా లేదు.

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి.. ఈ సామెత తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వింటే భారతం వినాలి తింటే అక్కడి మైసూర్ పాక్ తినాలి అనేది చాలా మందికి తెలుసు. వందేళ్ళ క్రితం అక్కడి రాజావారి సంస్థానంలోని పాకశాలలో కమలమ్మ అనే ఓ మహిళ సొంతంగా తయారుచేసిన మైసూర్ పాకు రాజావారి కుటుంబానికి తెగ నచ్చేసింది. ఆతర్వాత అది చాలా ఏళ్ల తర్వాత బయట వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. కమలమ్మ మైసూర్ పాక్ గా ఎంతో ప్రసిద్ధి చెందింది. వందేళ్లు దాటినా ఆ మైసూర్ పాక్ కి ఏం మాత్రం క్రేజ్ తగ్గక పోగా ప్రతి ఏడాది కి క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ ఉంది.
అయితే అందరూ సెనగపిండితో మైసూర్ పాక్ చేస్తే.. ఆమె మాత్రం కేవలం జీడిపప్పు, నెయ్యి మాత్రమే వాడి సరైన పాకంతో మైసూర్ పాక్ తయారు చేస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుమల లడ్డు ప్రసాదంతో తిరుగు ప్రయాణంలో రూట్ మ్యాప్ పెట్టుకుని మరి ఈ మైసూర్ పాక్ కోసం అక్కడికి వస్తున్నారంటే.. దానికి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పకనక్కర్లేదు. ఇంతకీ ఆ మైసూరు పాకు ఎక్కడ దొరుకుతుంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఆ మైసూర్ పాకు గురించి తెలుసుకుందాం.
వందేళ్ళ క్రితం కమలమ్మ అనే మహిళ వెంకటగిరిలో రాజావారి సంస్థానంలో ఉండేది. ఆమె పాఠశాలలో జీడిపప్పు, నెయ్యి వేసి సొంత రెమిడీతో ఓ మైసూర్ పాక్ తయారు చేసింది. ఇది తిన్న రాజావాళ్లు ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. దీంతో అప్పటి నుంచి ఈ మైసూర్ పాకు కమలమ్మ మైసూరు పాకుగా ప్రచారంలోకి వచ్చింది. ఆనాటి రాజుల కాలం నుంచి నేటి వరకు ఈ కమలమ్మ మైసూర్ పాకు ఎంతో ఫేమస్.
తిరుమలకి వెళ్తే ప్రసాదం తెమ్మని ఎలా అడుగుతారో వెంకటగిరి వైపు వెళ్తున్న వారిని కమలమ్మ మైసూరు పాకు తెమ్మని ఆడిగుతారు. వెంకటగిరిలో కమలమ్మ పేరుతో ఎంతో మంది మైసూర్ పాక్ చేసినా ఆనాటి రాజుల సంస్థానంలో చేసిన కమలమ్మ వంశీయులు చేస్తున్న మైసూర్ పాకుకు ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది. కేవలం జీడిపప్పు నెయ్యి రెండు కలిపి చేసిన ఈ కమలమ్మ మైసూరు పాకు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగపోతుంది.ఈ స్వీటు బయట ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం వేల కిలోల్లో అమ్ముడు పోతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
