AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dental Health: పళ్లు తోముతున్నా పురుగులు పడుతున్నాయా? డాక్టర్ చెప్పిన ఈ నిజం మీకు షాకిస్తుంది!

రోజుకు రెండుసార్లు సరిగా బ్రష్ చేస్తున్నా దంతక్షయం వస్తుందా? దీనికి కారణం మీ చిరుతిళ్ల అలవాటే అంటున్నారు దంత వైద్య నిపుణులు. రోజంతా తరచుగా ఏదో ఒకటి నమలడం వల్ల దంతాలపై ఆమ్ల దాడి ఎలా జరుగుతుంది? దంత ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందా? ఇష్టమైన ఇండియన్ స్నాక్స్ తింటుంటే మీ పళ్లు డేంజర్‌లో ఉన్నట్టేనని చెబుతున్నారు దంత వైద్యులు. మీరు ఎంత జాగ్రత్తగా బ్రష్ చేసినా, తరచుగా స్నాకింగ్ చేస్తే ఆ నష్టాన్ని పూడ్చలేమంటున్నారు. ఈ అలవాటు దంతాలపై ఎలా ఒత్తిడి కలిగిస్తుంది? దీనిని నివారించడానికి డాక్టర్ మోత్వాణి ఇచ్చిన సలహాలు ఏమిటో చూద్దాం.

Dental Health: పళ్లు తోముతున్నా పురుగులు పడుతున్నాయా? డాక్టర్ చెప్పిన ఈ నిజం మీకు షాకిస్తుంది!
Dental Health
Bhavani
|

Updated on: Dec 06, 2025 | 3:39 PM

Share

మీరు తరచూ చిరుతిళ్లు తినే అలవాటు ఉందా? రోజుకు రెండుసార్లు సరిగ్గా బ్రష్ చేసినా మీ దంత ఆరోగ్యం ప్రమాదంలో ఉంటుంది. రోజంతా ఏదో ఒకటి నమలడం అనేక సమస్యలు తెస్తుంది. కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఎస్తటిక్ డెంటిస్ట్రీ నిపుణురాలు, డాక్టర్ నికితా మోత్వాణి అభిప్రాయాలు తెలుసుకుందాం.

నిరంతర చిరుతిళ్లు ఎందుకు హాని చేస్తాయి?

డాక్టర్ మోత్వాణి ఈ విధంగా వివరించారు: చక్కెర లేదా స్టార్చ్ ఎక్కువ ఉన్న ఆహారం లేదా పానీయం తీసుకున్నప్పుడు, నోటిలోని బ్యాక్టీరియా వాటిని ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల ఎనామిల్‌పై హాని కలిగిస్తుంది. నోటిలోని pH స్థాయి తగ్గుతుంది. దీనినే ‘ఆమ్ల దాడి’ (Acid Attack) అంటారు. మీరు ఏదైనా తిన్నా, తాగినా ఇది 20 నుంచి 30 నిమిషాలు ఉంటుంది.

బ్రష్ చేస్తే పళ్లు సురక్షితం అనుకోవద్దు. మీరు ప్రతిసారి తిన్నప్పుడు, మీ నోరు ఆమ్ల దాడిని ఎదుర్కొంటుంది. ఎంత చక్కెర ఉంది అనే దానికంటే, ఎన్నిసార్లు చిరుతిళ్లు తింటున్నారు (Frequency) అనేదే దంతక్షయానికి ఎక్కువ బాధ్యత వహిస్తుంది.

దంతాలకు విరామం ఇవ్వండి

చాలా మంది బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, కాఫీ వంటివి రోజంతా మాటిమాటికీ తింటారు. దీనిని గ్రేజింగ్ లైఫ్‌స్టైల్ అంటారు. దీనివల్ల దంతాలకు విశ్రాంతి దొరకదు. నిరంతరం స్నాకింగ్ చేయడం వల్ల నోరు ఎక్కువ గంటలు ఆమ్ల స్థితిలోనే ఉంటుంది. ఫలితంగా లాలాజలం (Saliva) ఎనామిల్‌ను రిపేర్ చేసే అవకాశం ఉండదు. పళ్లలో పురుగులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దంతాలు తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చేలా ఒక షెడ్యూల్ ప్రకారం మాత్రమే ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు.

దంతాలకు హాని చేసే స్నాక్స్

ఈ స్నాక్స్ దంతాల మధ్య ఇరుక్కుంటాయి. ఇది దంతక్షయానికి అనువైన వాతావరణం సృష్టిస్తుంది:

జిగురు డ్రై ఫ్రూట్స్: ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పళ్లు (Figs), అంజీర్ రోల్స్, ఎనర్జీ బార్స్ వంటివి దంతాల మధ్య ఇరుక్కుని ఎక్కువ గంటలు అలాగే ఉంటాయి.

ఇండియన్ నమ్‌కీన్, చిప్స్: పిండి పదార్థాలు (Carbs) చక్కెరగా మారుతాయి. చిన్న ముక్కలు పంటి లోపల ఇరుక్కుంటాయి.

గ్రాన్యులా/ఎనర్జీ బార్స్: వీటిలో ఎక్కువగా చక్కెరలు, తేనె లేదా సిరప్ ఉంటాయి.

పండ్ల రసాలు/స్మూతీలు/కొబ్బరి నీళ్లు: వీటిలో పండు నుంచి వచ్చే చక్కెర, ఆమ్లం చాలా ఎక్కువ.

మసాలా చాయ్/కోల్డ్ కాఫీ: చక్కెర వేసి గంటపాటు చాయ్ లేదా కాఫీ తాగితే, అది 4 నుంచి 5 సార్లు ఆమ్ల దాడికి కారణమవుతుంది.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్యపరమైన సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. దంత సమస్యలపై ఎప్పుడైనా మీ వైద్యుడిని సంప్రదించండి.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా