Kids Health: ఈ 7 ఫుడ్స్‌తో మీ పిల్లల మెమొరీ అద్భుతం.. ట్రై చేసేయండి
పిల్లల ఎదుగుదల సమయంలో, వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు చాలా కీలకం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థితి మెరుగ్గా ఉండాలంటే వారికి సరైన పోషకాలు అందడం తప్పనిసరి. మనం అందించే ఆహారంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ..

పిల్లల ఎదుగుదల సమయంలో, వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు చాలా కీలకం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థితి మెరుగ్గా ఉండాలంటే వారికి సరైన పోషకాలు అందడం తప్పనిసరి. మనం అందించే ఆహారంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ‘సూపర్ ఫుడ్స్’ నేరుగా వారి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఏడు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..
1. డార్క్ చాక్లెట్
చాక్లెట్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. అంతేకాకుండా, ఇవి పిల్లల మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
2. వాల్‌నట్స్
వాల్‌నట్స్ చూడటానికి మెదడు ఆకారంలో ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతగానో మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు పిల్లల జ్ఞాపకశక్తిని, మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
3. ఆకుకూరలు
తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలలో విటమిన్ K, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో, మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. పిల్లలకు కూర రూపంలో కాకుండా, స్మూతీలు లేదా పరోటాలలో కలిపి ఇవ్వడం సులభమైన పద్ధతి.
4. బెర్రీ పండ్లు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి రంగుల బెర్రీ పండ్లను పిల్లలు ఇష్టపడతారు. ఈ పండ్లలో అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ సహజ పిగ్మెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
5. బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్‌తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేసి, మెదడు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.
6. పొద్దుతిరుగుడు విత్తనాలు
ఈ విత్తనాలలో మెదడును ఉత్తేజపరిచే అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వీటిలో ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. వీటిని కొద్దిగా వేయించి లేదా సలాడ్స్‌లో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.
7. టమాట
టమాటాలు కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. టమాటాలను ప్రతిరోజూ పిల్లల ఆహారంలో భాగం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది.
పిల్లల మెదడు ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. వారి రోజువారీ ఆహారంలో ఈ 7 సూపర్ ఫుడ్స్‌ను వివిధ రూపాల్లో చేర్చడం ద్వారా వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




