AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra: విశాఖపట్నం టు చార్‌ధామ్.. ఎలాంటి రిస్క్ లేకుండా 12 రోజుల్లో వెళ్లి రావొచ్చు.. ఇదిగో ఫుల్ ప్యాకేజీ

IRCTC Char Dham Yatra package: ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం భక్తుల కోసం ప్రత్యేకంగా చార్‌ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 12 రోజులు, 11 రాత్రులు ఉంటుంది. ఈ యాత్ర జూన్ 12న విశాఖపట్నం నుంచి ప్రారంభమై జూన్ 23న ముగుస్తుంది. ఈ టూర్‌లో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో పాటు బార్కోట్, గుప్తకాశి, హరిద్వార్, సోన్‌ప్రయాగ్ వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

Char Dham Yatra: విశాఖపట్నం టు చార్‌ధామ్.. ఎలాంటి రిస్క్ లేకుండా 12 రోజుల్లో వెళ్లి రావొచ్చు.. ఇదిగో ఫుల్ ప్యాకేజీ
Chardham Yatra Irctc
Rajashekher G
|

Updated on: Mar 09, 2026 | 9:28 AM

Share

పవిత్రమైన చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra )కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే పలు మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ప్రయాణం, టికెట్లు, వసతి, భోజనం వంటి ఎలాంటి సమస్యా లేకుండా ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం భక్తుల కోసం ప్రత్యేకంగా చార్‌ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ ప్యాకేజీ మొత్తం 12 రోజులు, 11 రాత్రులు ఉంటుంది. ఈ యాత్ర జూన్ 12న విశాఖపట్నం నుంచి ప్రారంభమై జూన్ 23న ముగుస్తుంది. ఈ టూర్‌లో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో పాటు బార్కోట్, గుప్తకాశి, హరిద్వార్, సోన్‌ప్రయాగ్ వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

టూర్ షెడ్యూల్

  • డే 1
  • విశాఖపట్నం నుంచి ఉదయం 08:50 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 15:55 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హరిద్వార్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం హరిద్వార్ దేవాలయాలను సందర్శించి, గంగా హారతిని దర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత హరిద్వార్‌లో బస.
  • డే 2
  • అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి బార్కోట్ వైపు ప్రయాణం. సాయంత్రం అక్కడికి చేరుకుని హోటల్‌లో బస.
  • డే 3
  • ఉదయం యమునోత్రి ఆలయం దర్శనం కోసం జానకి చట్టికి ప్రయాణం. అక్కడి నుంచి ట్రెక్కింగ్ ద్వారా యమునోత్రి చేరుకుంటారు. దర్శనం అనంతరం తిరిగి జానకి చట్టికి వచ్చి బార్కోట్‌కు చేరుకుని రాత్రి బస.
  • డే 4
  • అల్పాహారం తర్వాత ఉత్తరకాశికి బయలుదేరుతారు. మార్గమధ్యలో బ్రహ్మఖల్ సమీపంలోని ప్రకటేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శనం. సాయంత్రం ఉత్తరకాశిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం సందర్శన. రాత్రి బస ఉత్తరకాశిలోనే.
  • డే 5
  • ఉదయం గంగోత్రి ఆలయానికి బయలుదేరుతారు. భాగీరథి నది తీరాన సాగిన అందమైన ప్రయాణం తర్వాత గంగోత్రి ఆలయంలో గంగాదేవి దర్శనం, పూజలు.
  • డే 6
  • అల్పాహారం అనంతరం గుప్తకాశి / సీతాపూర్ వైపు ప్రయాణం. సాయంత్రం చేరుకుని రాత్రి బస.
  • డే 7
  • ఉదయం 4 గంటలకు బయలుదేరి సోన్‌ప్రయాగ్ ద్వారా గౌరీకుండ్ చేరుకుంటారు. అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమై కేదార్‌నాథ్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి బస.
  • డే 8
  • ఉదయం కేదార్‌నాథ్ ఆలయంలో పూజ, దర్శనం, అభిషేకం. అనంతరం గౌరీకుండ్ వరకు సుమారు 16 కి.మీ ట్రెక్కింగ్. అక్కడి నుంచి టాక్సీ ద్వారా సోన్‌ప్రయాగ్ చేరుకుని హోటల్‌లో బస.
  • డే 9
  • అల్పాహారం తర్వాత బద్రీనాథ్కు ప్రయాణం. మార్గంలో జోషిమఠ్‌లోని నర్సింగ్ స్వామి ఆలయం దర్శనం. సాయంత్రం బద్రీనాథ్ ఆలయంలో ఆరతి దర్శనం. రాత్రి బస బద్రీనాథ్‌లో.
  • డే 10
  • ఉదయం బద్రీనాథ్ ఆలయంలో అభిషేక దర్శనం. తరువాత బ్రహ్మకపాల్ వద్ద పూజలు, తర్పణం. అనంతరం ఇండో–టిబెట్ సరిహద్దులో ఉన్న భారతదేశపు చివరి గ్రామం మానా సందర్శన. రాత్రి బస రుద్రప్రయాగ్లో.
  • డే 11
  • రుద్రప్రయాగ్ నుంచి హరిద్వార్‌కు ప్రయాణం. మార్గంలో మానస దేవి, చండీ దేవి ఆలయాల దర్శనం. రాత్రి బస హరిద్వార్‌లో.
  • డే 12
  • అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వెళ్తారు. మధ్యాహ్నం 4:35 గంటలకు విమానం బయలుదేరి, రాత్రి 10:10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

  • సింగిల్ ఆక్యూపెన్సీ: ₹98,765
  • డబుల్ ఆక్యూపెన్సీ: ₹87,510
  • ట్రిపుల్ ఆక్యూపెన్సీ: ₹83,010
  • చైల్డ్ విత్ బెడ్: ₹54,495
  • చైల్డ్ వితౌట్ బెడ్: ₹42,585

ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సందర్శించవచ్చు.

Follow Us
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం