AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duck: సుడి అంటే ఇది.. మాంసం కూర తిందామని బాతును కోస్తుండగా.. దాని కడుపులో

ఒక బాతు కడుపులో 10 గ్రాముల బంగారం బయటపడిన సంఘటన చైనాలో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతు కథ కేవలం ఊహ అనుకున్నారు. కానీ బంగారు నిల్వలున్న ప్రాంతంలో పెరిగిన బాతు బురదలో పురుగులను తింటుండగా పుత్తడిని మింగింది. దాని మరణానంతరం లభించిన బంగారం యజమానిని అనూహ్యమైన ఆనందానికి గురి చేసింది.

Duck: సుడి అంటే ఇది.. మాంసం కూర తిందామని బాతును కోస్తుండగా.. దాని కడుపులో
Gold Inside Duck
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2026 | 10:51 AM

Share

బంగారు గుడ్లు పెట్టే బాతు కథ తరచుగా వింటుంటాం. దురాశకు పోతే ఫలితం ఉండదని తెలిపే ఈ కథ ఒకప్పుడు కేవలం కల్పితం అనుకున్నారు. అయితే చైనాలో జరిగిన ఒక సంఘటన ఈ బంగారు బాతు కథకు నిజ జీవిత రూపమిచ్చింది. చైనాలో ఒక యజమాని పెంచుతున్న బాతు మరణించిన తర్వాత దాని కడుపులో పది గ్రాముల బంగారం బయటపడింది. సాధారణంగా ఏ బాతును కోసినా పేగులు, జీర్ణ వ్యవస్థే ఉంటాయి. కానీ ఈ బాతు కడుపులో బంగారం ఉండటంతో యజమాని ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగిందని పరిశీలించగా, బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంలో ఆ బాతు పెరిగిందని తెలిసింది. బురదలో పురుగులను వెతుకుతూ తింటుండగా, పురుగుగా భావించి బంగారాన్ని మింగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారం బాతు కడుపులో జీర్ణం కాకుండా ఉండిపోయింది.

తర్వాత ఆ కణాలపై బర్నింగ్ టెస్ట్ నిర్వహించగా అవి నిజమైన బంగారమేనని నిర్ధారణ అయింది. మొత్తం దాదాపు 10 గ్రాముల బంగారం ఉండగా, దాని విలువ సుమారు 12,000 యువాన్ .. అంటే దాదాపు రూ.1.62 లక్షలుగా ఉంది. వారి బాతులను ఒక నది దగ్గర స్వేచ్ఛగా పెంచుతారని, ఆ ప్రాంతంలో గతంలో బంగారం తవ్వకాలు జరిగేవని చెప్పారు. బాతులు ఆ నదిలోని మట్టిని తింటూ ఉండగా అందులో ఉన్న బంగారం కణాలు కడుపులోకి వెళ్లి ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం చైనాలో బంగారం ధర గ్రాముకు సుమారు 1,140 నుంచి 1,190 యువాన్ మధ్యలో ఉంది.

Follow Us