AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్ర దిశ కూడా మీ అదృష్టాన్ని మార్చగలదు.. వాస్తు ప్రకారం సరైన దిశ తెలుసుకోండి

Vastu Sleep Direction: వాస్తు శాస్త్రం మనం నిద్రించేందుకు సరైన దిశలు కూడా ఉన్నాయని చెబుతోంది. తప్పుడు దిశలో తల పెట్టి నిద్రపోతే అది కేవలం నిద్ర నాణ్యతనే కాకుండా మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలకు కూడా కారణమవుతుందని నమ్మకం ఉంది. అందుకే వాస్తు ప్రకారం సరైన నిద్ర విధానం ఏమిటో తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 09, 2026 | 11:15 AM

Share
Best Sleep Direction: మనం సాధారణంగా కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాటిని మెరుగుపరచడానికి కృషి చేస్తుంటాం. కానీ మన రోజువారీ చిన్న అలవాట్లకూ వాస్తు శాస్త్రంతో గాఢమైన సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దిశ, స్థానం మన జీవితంపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Best Sleep Direction: మనం సాధారణంగా కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాటిని మెరుగుపరచడానికి కృషి చేస్తుంటాం. కానీ మన రోజువారీ చిన్న అలవాట్లకూ వాస్తు శాస్త్రంతో గాఢమైన సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దిశ, స్థానం మన జీవితంపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

1 / 7
అందులో ముఖ్యమైన విషయం మనము నిద్రించే దిశ. తప్పుడు దిశలో తల పెట్టి నిద్రపోతే అది కేవలం నిద్ర నాణ్యతనే కాకుండా మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలకు కూడా కారణమవుతుందని  నమ్మకం ఉంది. అందుకే వాస్తు ప్రకారం సరైన నిద్ర విధానం ఏమిటో తెలుసుకుందాం.

అందులో ముఖ్యమైన విషయం మనము నిద్రించే దిశ. తప్పుడు దిశలో తల పెట్టి నిద్రపోతే అది కేవలం నిద్ర నాణ్యతనే కాకుండా మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలకు కూడా కారణమవుతుందని నమ్మకం ఉంది. అందుకే వాస్తు ప్రకారం సరైన నిద్ర విధానం ఏమిటో తెలుసుకుందాం.

2 / 7

దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం శుభప్రదం.. 

వాస్తు శాస్త్రం ప్రకారం తల దక్షిణ దిశలో, పాదాలు ఉత్తర దిశలో ఉండేలా నిద్రించడం అత్యంత మంచిదిగా భావిస్తారు. ఈ విధంగా నిద్రపోతే శరీరంలోని శక్తి సమతుల్యంగా ఉండి, గాఢమైన నిద్ర పొందుతారని విశ్వాసం. ఇది మానసిక ప్రశాంతతను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా చెబుతారు. మతపరమైన నమ్మకాల ప్రకారం దక్షిణం యమధర్మరాజు దిశగా భావించబడినా, తల దక్షిణం వైపు ఉంచి నిద్రపోవడం శరీరంలోని అయస్కాంత సమతుల్యతకు అనుకూలంగా ఉండి సానుకూల శక్తిని అందిస్తుందని అంటారు.

దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం శుభప్రదం.. వాస్తు శాస్త్రం ప్రకారం తల దక్షిణ దిశలో, పాదాలు ఉత్తర దిశలో ఉండేలా నిద్రించడం అత్యంత మంచిదిగా భావిస్తారు. ఈ విధంగా నిద్రపోతే శరీరంలోని శక్తి సమతుల్యంగా ఉండి, గాఢమైన నిద్ర పొందుతారని విశ్వాసం. ఇది మానసిక ప్రశాంతతను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా చెబుతారు. మతపరమైన నమ్మకాల ప్రకారం దక్షిణం యమధర్మరాజు దిశగా భావించబడినా, తల దక్షిణం వైపు ఉంచి నిద్రపోవడం శరీరంలోని అయస్కాంత సమతుల్యతకు అనుకూలంగా ఉండి సానుకూల శక్తిని అందిస్తుందని అంటారు.

3 / 7

తూర్పు దిశలో తల పెట్టి నిద్రించడం కూడా మంచిదే.. 

ఏదైనా కారణంగా దక్షిణ దిశ సాధ్యం కాకపోతే తూర్పు దిశలో తల పెట్టి నిద్రించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం తూర్పు దిశ జ్ఞానం, శక్తి, సానుకూలతకు సంకేతం.
ఈ దిశలో నిద్రపోతే ఏకాగ్రత పెరుగుతుందని, ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

తూర్పు దిశలో తల పెట్టి నిద్రించడం కూడా మంచిదే.. ఏదైనా కారణంగా దక్షిణ దిశ సాధ్యం కాకపోతే తూర్పు దిశలో తల పెట్టి నిద్రించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం తూర్పు దిశ జ్ఞానం, శక్తి, సానుకూలతకు సంకేతం. ఈ దిశలో నిద్రపోతే ఏకాగ్రత పెరుగుతుందని, ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

4 / 7

ఉత్తర దిశలో తల పెట్టి నిద్రించడం ఎందుకు మంచిది కాదు?.. 

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది కాదని భావిస్తారు. ఈ దిశలో నిద్రపోతే శరీరంలోని శక్తి అసమతుల్యంగా మారి నిద్రలో అంతరాయం కలగవచ్చని నమ్మకం.
దీంతో తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు కలగవచ్చని చెబుతారు. అందువల్ల ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోకుండా  ఉండటం మంచిదని సూచిస్తారు.

ఉత్తర దిశలో తల పెట్టి నిద్రించడం ఎందుకు మంచిది కాదు?.. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది కాదని భావిస్తారు. ఈ దిశలో నిద్రపోతే శరీరంలోని శక్తి అసమతుల్యంగా మారి నిద్రలో అంతరాయం కలగవచ్చని నమ్మకం. దీంతో తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు కలగవచ్చని చెబుతారు. అందువల్ల ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోకుండా ఉండటం మంచిదని సూచిస్తారు.

5 / 7
పడమర దిశలో తల పెట్టి నిద్రించడం

పడమర దిశలో తల పెట్టి నిద్రించడం సాధారణంగా తటస్థంగా పరిగణించబడుతుంది. ఇది ప్రత్యేకంగా శుభమని కూడా కాదు, పూర్తిగా అశుభమని కూడా కాదు. అయితే కొన్ని వాస్తు నమ్మకాల ప్రకారం ఈ దిశలో నిద్రపోతే పనుల్లో ఆలస్యం లేదా మానసిక అసాంతి కలగవచ్చని చెబుతారు. అందుకే దీనిని చివరి ఎంపికగా మాత్రమే పరిగణించడం మంచిది.

పడమర దిశలో తల పెట్టి నిద్రించడం పడమర దిశలో తల పెట్టి నిద్రించడం సాధారణంగా తటస్థంగా పరిగణించబడుతుంది. ఇది ప్రత్యేకంగా శుభమని కూడా కాదు, పూర్తిగా అశుభమని కూడా కాదు. అయితే కొన్ని వాస్తు నమ్మకాల ప్రకారం ఈ దిశలో నిద్రపోతే పనుల్లో ఆలస్యం లేదా మానసిక అసాంతి కలగవచ్చని చెబుతారు. అందుకే దీనిని చివరి ఎంపికగా మాత్రమే పరిగణించడం మంచిది.

6 / 7
నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు.. 

మంచాన్ని ఎప్పుడూ శుభ్రంగా, సక్రమంగా ఉంచాలి. మురికి లేదా అస్తవ్యస్తంగా ఉన్న మంచం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తు చెబుతుంది. మంచాన్ని బీమ్ కింద ఉంచకూడదు. బీమ్ కింద నిద్రించడం మానసిక ఒత్తిడిని పెంచుతుందని నమ్మకం. నిద్రపోతున్నప్పుడు పాదాలు నేరుగా తలుపు వైపు ఉండకుండా చూసుకోవాలి. తల దగ్గర బరువైన వస్తువులు లేదా అనవసరమైన వస్తువులు పెట్టకూడదు. ఇవి మానసిక అస్థిరతకు కారణమవుతాయని అంటారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు.. మంచాన్ని ఎప్పుడూ శుభ్రంగా, సక్రమంగా ఉంచాలి. మురికి లేదా అస్తవ్యస్తంగా ఉన్న మంచం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తు చెబుతుంది. మంచాన్ని బీమ్ కింద ఉంచకూడదు. బీమ్ కింద నిద్రించడం మానసిక ఒత్తిడిని పెంచుతుందని నమ్మకం. నిద్రపోతున్నప్పుడు పాదాలు నేరుగా తలుపు వైపు ఉండకుండా చూసుకోవాలి. తల దగ్గర బరువైన వస్తువులు లేదా అనవసరమైన వస్తువులు పెట్టకూడదు. ఇవి మానసిక అస్థిరతకు కారణమవుతాయని అంటారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

7 / 7
Follow Us