Abbas: ఏంటీ ఈ అమ్మడు హీరో అబ్బాస్ కూతురా.! ముట్టుకుంటే మారిపోతుందేమో..!!
అబ్బాస్.. 90’s యూత్ ఫేవరేట్ హీరో. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో ప్రేమకథ సినిమాలతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఒకప్పుడు అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే అదొక ట్రెండ్. కుర్రాళ్లు ఆ హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు. ఇక అమ్మాయిలకు ఇష్టమైన లవర్ బాయ్.

కొన్ని సినిమాలో ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుంటాయి. వాటిలో ప్రేమ దేశం సినిమా ఒకటి. 1996లో విడుదలైన ప్రేమ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీలో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా కాలేజీ ఫంక్షన్లు, ఈవెంట్లలో ఎక్కడో ఒకచోట ప్రేమదేశం సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాతో వినీత్, అబ్బాస్, టబుల కెరీరే మారిపోయింది. ముఖ్యంగా హీరో అబ్బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓవైపు రాజ హంస వంటి సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూనే రాజా, కృష్ణ బాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ పోషించాడు.
ఇక నీ ప్రేమకై, నితిన్ మారో వంటి సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో నటించాడు అబ్బాస్. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2011లో మారో తర్వాత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు అబ్బాస్. కేవలం యాడ్స్ లోనే అప్పుడప్పుడూ టీవీల్లో కనిపించాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ఈ స్టార్ హీరో
కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు అబ్బాస్. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమాలో అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళం భాషలలో దాదాపు 50కి పైగ సినిమాల్లో నటించిన అబ్బాస్.. న్యూజిలాండ్ లో సెటిల్ సెటిల్ అయ్యి అక్కడే సాఫ్ట్ వేర్ జాబ్చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అబ్బాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అబ్బాస్ కూతురి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అబ్బాస్ 1997లో ఏరూమ్ అని అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అబ్బాస్ కూతురు హీరోయిన్స్ మించిన అందంతో కట్టిపడేస్తుంది.
View this post on Instagram
ఎమిర్ అలీ..

Emira Ali
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




