AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఘటన తర్వాతే ప్రకాశ్‌ రాజ్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు.. కానీ అందుకే సినిమా ఆఫర్స్ పోయాయి.. ప్రకాశ్ రాజ్ భార్య కామెంట్స్..

దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈమధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త బహిరంగంగా రాజకీయల గురించి మాట్లాడటం పై ఆయన భార్య పోనీ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో అని తాను భయపడినట్లు తెలిపింది.

ఆ ఘటన తర్వాతే ప్రకాశ్‌ రాజ్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు.. కానీ అందుకే సినిమా ఆఫర్స్ పోయాయి.. ప్రకాశ్ రాజ్ భార్య కామెంట్స్..
Prakash Raj, Pony Verma
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 9:15 PM

Share

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాశ్‌ రాజ్. కానీ ఈమధ్య కాలంలో ఆయన ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ విధంగా బహిరంగంగా గళం విప్పడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి గల అసలు కారణం ఏమిటనే దానిపై ఆయన సతీమణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యే ప్రకాశ్‌రాజ్ ఆలోచనా విధానంలో పెను మార్పు తెచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కానీ తన భర్త ప్రశ్నించడం గురించి తాను ఎంతో ఆందోళన చెందానని అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతం ప్రకాశ్‌రాజ్‌ను మానసికంగా ఎంతో కృంగదీసిందని పోనీ వర్మ గుర్తుచేసుకున్నారు. ఆ ఘటనకు ముందు ఆయన భయపడినప్పటికీ, ఆ దుర్ఘటన తర్వాత మాత్రం ఆయనలో ధైర్యం వచ్చిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

“గౌరీ మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక మహిళ ధైర్యంగా నిలబడి గొంతుక వినిపించినప్పుడు, తాను కూడా మాట్లాడాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు” అని ఆమె పేర్కొన్నారు. భయం నీడలో ఎంతకాలం బతకాలి అనే కోణంలోంచి ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారని ఆమె వెల్లడించారు. ఈ విధంగా నిరంతరం తన గళాన్ని వినిపించడం వల్ల ప్రకాశ్‌రాజ్ వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పోనీ వర్మ తెలిపారు. ఆయన రాజకీయ అభిప్రాయాల కారణంగా పలువురు నిర్మాతలు చేతికి అడ్వాన్స్‌లు ఇచ్చినప్పటికీ సినిమాల నుంచి తప్పించారని, అనేక యాడ్స్ కూడా చేజారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన అంతరాత్మ చెప్పిన తప్పును తాను అంగీకరించబోనని ప్రకాశ్‌రాజ్ స్పష్టంగా చెబుతుంటారని ఆమె తెలిపారు.

దేశంలో ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపడాలని మాత్రమే ఆయన కోరుకుంటారని, ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన ఈ పోరాటం చేస్తున్నారని పోనీ వర్మ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, భర్త తీసుకునే నిర్ణయాలు తనను మొదట్లో భయపెట్టినా, ఆయన సిద్ధాంతాలను, సమాజం పట్ల ఆయనకు ఉన్న పరిపక్వతను తాను గౌరవిస్తానని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us