AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‏లో రోహిత్ అవుట్.. మరో కంటెస్టెంట్ ఎవరంటే..

బిగ్ బాస్ 10 తెలుగు షో ఇప్పుడు ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ మాత్రం ప్రేక్షకులకు షాకిస్తున్నాయి. గత వారమే డబుల్ ఎలిమినేషన్ అంటూ దక్షితోపాటు షాలినిని సైతం బయటకు పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉందని సమాచారం. అంతేకాదు విన్నర్ అనుకున్న రోహిత్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‏లో రోహిత్ అవుట్.. మరో కంటెస్టెంట్ ఎవరంటే..
Bigg Boss Telugu 10 Double Elimination
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 8:58 PM

Share

టెలివిజన్ రంగంలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న రియాలిటీ షో ‘బిగ్‌ బాస్ తెలుగు 10’. గతవారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టేసరికి సరికొత్త మలుపులు తిరుగుతోంది. బిగ్‌ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియతో పాటు హౌజ్‌లో జరిగిన అనూహ్య పరిణామాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. అయితే ఈ వారం తక్కువ ఓటింగ్ ఉందని సుధీర్‌ని ఎలిమినేట్ చేసినట్లు చూపించినప్పటికీ, ముకేష్ తన దగ్గరున్న పవర్ తోపాటు ఝాన్సీ పవర్ సైతం ఉపయోగించి సుధీర్ ను సేవ్ చేశాడు. దీంతో ఇప్పుడు ఝాన్సీ పరిస్థితి డేంజర్ జోన్ లోకి వెళ్లింది. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడం.. అటు వర్షిణి సేవ్ కావడంతో ఝాన్సీ బయటకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఎలిమినేషన్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఝాన్సీ ఎలిమినేషన్ తర్వాత మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలోనే హౌజ్‌మేట్స్ అందరి ఓటింగ్‌ ఆధారంగా మరో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే టాస్క్ నిర్వహించారు. హౌజ్‌లో కొనసాగడానికి ఎవరు అనర్హులు అనే అంశంపై కంటెస్టెంట్లు మెజారిటీ ఓట్లతో రోహిత్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. తోటి హౌజ్‌మేట్స్ వేసిన ఓట్ల ఆధారంగా రోహిత్‌ను ఈ వారం ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించారు. కానీ, ఇక్కడే బిగ్‌ బాస్ అందరికీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ను నేరుగా హౌస్ బయటకు పంపించాల్సి ఉంటుంది. కానీ, రోహిత్‌ను ఇంటికి పంపకుండా నేరుగా సీక్రెట్ రూమ్‌కి పంపించినట్లు సమాచారం. బిగ్‌ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ల చరిత్రలో ఒకే సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్‌కి పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

గతంలో షాలినిని కూడా ఇలాగే సీక్రెట్ రూమ్‌కి పంపి, ఆ తర్వాత మళ్లీ హౌజ్‌లోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో షాలిని ఆశించిన స్థాయిలో తన ఆటను మార్చుకోలేకపోవడంతో మళ్లీ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా సీక్రెట్ రూమ్‌కి వెళ్లిన రోహిత్ అక్కడ నుంచి తిరిగి హౌజ్‌లోకి వచ్చి తన గేమ్‌ను ఎలా మారుస్తాడు? ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ ఎలిమినేషన్స్ , సీక్రెట్ రూమ్ సెంటిమెంట్ ఈ సీజన్‌ను మరింత రంజుగా మార్చేశాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి!

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us