Penny Stock: కేవలం రెండు నెలల్లో లక్షను.. రూ.5 లక్షలు చేసిన స్టాక్.. ఇంకా పెరుగుతూనే ఉన్న షేర్ ధర..
Multibagger Stock: పెన్ని స్టాక్స్‌లో(Penny stock) ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో ఒలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
Multibagger Stock: పెన్ని స్టాక్స్‌లో(Penny stock) ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో ఒలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అమాంతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు నష్టాలను కలిగిస్తుంటాయి. కానీ.. మార్కెట్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. కొంచెం కంపెనీ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుని పెట్టబడి పెట్టవారికి మాత్రం ఊహించని లాభాలు సొంతమవుతాయి. కొన్ని పెన్ని స్టాక్స్ స్వల్పకాలంలోనే మంచి రాబడులను అందిస్తుంటాయి. సామాన్య ప్రజలను కూడా లక్షాధికారులను, ఒక్కోసారి కోటీశ్వరులనూ కూడా చేస్తుంటాయి. ఈ కోవకు చెందినదే కోహినూర్ ఫుడ్స్(Kohinoor Foods) స్టాక్. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు స్మోకీ రిటర్న్స్ ఇచ్చింది. కేవలం రెండు నెలల్లోనే లక్ష రూపాయల పెట్టుబడిని రూ.5 లక్షలుగా మార్చింది. అంటే సుమారు 400 శాతం రాబడిని అందించింది.
గతేడాది ఈ కంపెనీ షేర్ ధరలో పెద్ద కరెక్షన్ జరిగింది. కానీ 2022 ఏప్రిల్ 6 నుంచి షేరు ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్‌లో వరుసగా 35 సెషన్ల ట్రేడింగ్‌లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవుతూ వస్తోంది. గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నట్లయితే మార్కెట్ల పనితీరు పేలవంగా ఉంది. అనేక కంపెనీలు తమ విలువను కోల్పోయాయి. కానీ కొన్ని స్టాక్స్ ఈ కాలంలో కూడా మంచి రాబడిని అందించాయి. ఈ స్టాక్ విలువ రూ.7.75 నుంచి మే 27, 2022 నాటికి రూ.38.40కి చేరుకుంది.
ఒక ఇన్వెస్టర్ అప్పట్లో ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే.. ప్రస్తుత ధర ప్రకారం అతనికి రూ.4.95 లక్షలు వచ్చేవి. సరిగ్గా నెల క్రితం అంటే ఏప్రిల్ 29 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్ ధర 147% పెరిగింది. అప్పట్లో ఈ షేర్ విలువ రూ.15.55గా ఉంది. అయితే పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదని పెట్టుబడి దారులు గుర్తుంచుకోవాలి. కోహినూర్ ఫుడ్స్ దేశంలో ప్రముఖ రైస్ బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ రెడీ టూ ఈట్ విభాగంలోనూ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీకి బియ్యం ప్యాకేజింగ్ యూనిట్లు ముర్తల్, సోనేపట్‌లో ఉన్నాయి. 1989 నుంచి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ ప్రపంచంలోని అనేక దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది.