సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
2026 సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు నుండి ఐదు, తమిళం నుండి రెండు చిత్రాలు బరిలో ఉన్నాయి. ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోల చిత్రాల పోటీతో థియేటర్ల పంపకం తీవ్ర సవాలుగా మారింది. భారీ విడుదలలతో స్క్రీన్ల సర్దుబాటు నిర్మాతల మధ్య పెద్ద సమస్యగా మారనుంది.
సంక్రాంతికి మరీ ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయా..? తెలుగు నుంచే 5గురు హీరోలు రేసులో ఉన్నారు. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించట్లేదు.. ప్రమోషన్స్ కూడా షురూ చేసారు. తమిళం నుంచి మరో ఇద్దరు వస్తున్నారు. అంటే మొత్తం 7 సినిమాలన్నమాట. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? థియేటర్స్ ఎలా పంచుకుంటారు..? తెలుగుకే సరిపోవట్లేదంటే తమిళం సినిమాలకు థియేటర్లు ఇస్తారా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. సంక్రాంతికి రావడమనేది హీరోలు ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే.. అది కచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే.. 2026 పొంగల్ చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారూ పండక్కి రాబోతుంది. ఇక జనవరి 9న రాజా సాబ్ వస్తున్నాడు. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. అలాగే జనవరి 14న అనగనగా ఒకరాజు విడుదల కానుంది. ఈ మధ్యలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారినారి నడుమ మురారి సినిమాలు కూడా షెడ్యూల్ అయ్యాయి. ఇవన్నీ సంక్రాంతి బరిలోనే ఉన్నాయి. వీటితో పాటు విజయ్ జన నాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి పండక్కే వస్తున్నాయి. ఒకేసారి పండక్కి 7 సినిమాలు వస్తే థియేటర్స్‌కు చాలా పెద్ద ఇష్యూ తప్పదు. ప్రతీసారి పొంగల్‌కు కనీసం 4 సినిమాలు బరిలో ఉంటాయి. వాటికే థియేటర్స్ సర్దేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు నిర్మాతలు. మా సినిమాకు తక్కువొచ్చాయి.. వాళ్లను తొక్కేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అలాంటిది 2026 పొంగల్‌కు ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి ప్రభాస్ సినిమాకు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. అదేరోజు రాబోతున్న జన నాయగన్‌కు మంచి స్క్రీన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తర్వాత చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్.. నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి కుర్ర హీరోలకు స్క్రీన్స్ ఎలా వస్తాయనేది చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !! హాలీవుడ్‌లో మార్కెట్ పై జక్కన్న మాస్టర్ ప్లాన్
iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
TOP 9 ET News: అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

