ఢిల్లీలో ఒక యువకుడు ఆర్మీ అధికారిగా నమ్మించి మోసం చేయాలని చూసిన సైబర్ మోసగాడికి చాట్ జీపీటీ సాయంతో చుక్కలు చూపించాడు. ఫేక్ వెబ్సైట్ లింక్ పంపి, మోసగాడి ఐపీ అడ్రెస్, మొబైల్ కెమెరా హ్యాక్ చేసి అతని ఫోటో సంపాదించాడు. ఆ వివరాలతో ఎదురుదాడి చేయడంతో మోసగాడు క్షమాపణలు చెప్పి, ఇకపై మోసాలు చేయనని ప్రాధేయపడ్డాడు.