Andhra Pradesh: చంద్రబాబు రాముడు – జగన్ రాక్షసుడు.. సీఎం పై లోకేశ్ ఫైర్
మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) హాట్ కామెంట్స్ చేశారు. శవాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి సీఎం అయ్యారని ఆరోపించారు. వైసీపీని యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీగా లోకేశ్ అభివర్ణించారు....
మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) హాట్ కామెంట్స్ చేశారు. శవాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి సీఎం అయ్యారని ఆరోపించారు. వైసీపీని యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీగా లోకేశ్ అభివర్ణించారు. చంద్రబాబునాయుడును(Chandrababu Naidu) రాముడితో పోల్చిన లోకేశ్.. జగన్‌ను రాక్షసుడితో పోల్చారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన జగన్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో పెట్రోల్, ఇసుక ధరలు విపరీతంగా పెరిగాయని ఫైర్ అయ్యారు. పన్నుల్లో రాష్ట్రం నంబర్ వన్‌గా ఎదిగిందని ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయని, ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో సీఎం జగన్‌కు ముందు చూపు లేదన్న లోకేశ్.. కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు.
మరో వైపు మహానాడులో నిన్న టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. “పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. పార్టీలో 2+1 విధానం రావాలి. రెండుసార్లు ఒక పదవిలో ఉన్న వారికి విరామం ఇవ్వాలి” అని లోకేశ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులను నియమించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదనను పెట్టానని చెప్పారు. మహానాడు తర్వాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నానన్న లోకేశ్.. డబ్బుతోనే రాజకీయం చేయలేమని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..