Weather Alert:మాడుపగిలే ఎండలు..మరో రెండు రోజుల్లో మార్పు, వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం మూడుగంటల వరకు ఎండ దంచికొడుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా మహాసముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో విస్తరిస్తూ మరో రెండు రోజుల్లో

Weather Alert:మాడుపగిలే ఎండలు..మరో రెండు రోజుల్లో మార్పు, వాతావరణ శాఖ హెచ్చరిక
Rain Alert
Follow us
Jyothi Gadda

|

Updated on: May 28, 2022 | 9:48 PM

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం మూడుగంటల వరకు ఎండ దంచికొడుతుంది. ఎండను చూసి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా మహాసముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో విస్తరిస్తూ మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కర్ణాటకపై ఉపరితల ఆవర్తనం శనివారం ఏర్పడిందని, అది సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కర్ణాటక పొరుగు ప్రాంతాల్లో విస్తరించనుందని పేర్కొన్నారు. దీని ఫలితంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన చోట్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు.

ఉత్తర కోస్త & యానాం:- లో రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమంగా రెండు నుంచి మూడుడిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా :- రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమ క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ :- రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా రెండు నుంచి మూడుడిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.