చెల్లెలి కోసం ఎడ్లబండిపై ఢిల్లీకి బయల్దేరిన అన్నకు అనుకోని అడ్డంకి..ఘటనలో కొత్త ట్విస్ట్!

తన తోడబుట్టిన చెల్లెలికి న్యాయం జరగాలని వినూత్న పోరాటం చేస్తున్న అన్న కథ ఊహించని మలుపు తిరిగింది. చెల్లెలి కోసం ఎడ్లబండిపై ఢిల్లీబాట పట్టిన అన్నయ్య సంఘటనలో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది.

చెల్లెలి కోసం ఎడ్లబండిపై ఢిల్లీకి బయల్దేరిన అన్నకు అనుకోని అడ్డంకి..ఘటనలో కొత్త ట్విస్ట్!
Bullock Cart
Follow us

|

Updated on: May 28, 2022 | 9:32 PM

తన తోడబుట్టిన చెల్లెలికి న్యాయం జరగాలని వినూత్న పోరాటం చేస్తున్న అన్న కథ ఊహించని మలుపు తిరిగింది. చెల్లెలి కోసం ఎడ్లబండిపై ఢిల్లీబాట పట్టిన అన్నయ్య సంఘటనలో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. హ్యూమన్ రైట్స్ కమిషన్‌ ఆదేశాలతో ఎడ్ల బండిని అడ్డుకున్నారు పోలీసులు. విజయవాడ వద్ద ఎడ్లబండిని అడ్డుకుని ప్రైవేటు వాహనంలో బాధితుల ఎడ్లబండిని నందిగామకు తరలించారు. అదేంటీ తన చెల్లెలి కోసం న్యాయ పోరాటం చేస్తున్న అన్నను పోలీసులు ఎందుకు అడ్డగించాల్సి వచ్చింది..

అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి ఓ అన్న కుమిలిపోయాడు. న్యాయం కోసం తల్లితో కలిసి ఢిల్లీ బాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా.. తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది. అయితే తమ కుటుంబం కోసం రెండు మూగజీవాలను హింసించే హక్కు ఎక్కడిదన న్యాయవాది రామచంద్రరావు కోర్టులో పిల్‌ వేశారు. దీంతో స్పందించిన హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ వెంటనే రంగంలోకి దిగింది. వెంటనే మూగజీవాలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన సోదరికి న్యాయం చేయాలంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు నాగదుర్గరావు.