Olectra: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్ బస్సులు.. ఒక్కసారిగా వేల కోట్లలో..

Olectra: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్ బస్సులు.. ఒక్కసారిగా వేల కోట్లలో..

Anil kumar poka

|

Updated on: May 28, 2022 | 8:57 PM

ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ యుగం నడుస్తోంది. పెట్రో సెగల్ని తట్టుకోలేని జనం E వెహికల్స్‌పై ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. ఈ రంగంలో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ దక్కింది. ఈ మేరకు బెస్ట్ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను అందుకుంది


ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ యుగం నడుస్తోంది. పెట్రో సెగల్ని తట్టుకోలేని జనం E వెహికల్స్‌పై ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. ఈ రంగంలో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ దక్కింది. ఈ మేరకు బెస్ట్ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను అందుకుంది ఒలెక్ట్రా సంస్థ. 2100 బస్సుల తయారీ ఆర్డర్‌ విలువ 3 వేల 675 కోట్లు. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అతి పెద్ద ఆర్డర్‌. కాంట్రాక్ట్‌ కాలంలో ఈ బస్సుల మెయింటెన్స్‌ బాధ్యతను కూడా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తీసుకుంటోంది.గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ /ఒపెక్స్‌ ప్రాతిపదికన 2100 బస్సులను సప్లై చేయాల్సి ఉంటుంది. ఈవీ ట్రాన్స్‌ నేరుగా కానీ లేదా స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ ద్వారా గానీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ బస్సులను వచ్చే 12 నెలల్లోగా అందజేయాల్సి ఉంటుంది. బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం సంతోషంగా ఉందన్నారు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ కేవి ప్రదీప్‌. దేశ ఆర్థిక రాజధానిలో అతి పెద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను నడపబోవడం గర్వంగా ఉందన్నారు. దేశంలో తొలిసారి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌.. ప్రస్తుతం పూణె, హైదరాబాద్‌, గోవా, డెహ్రాడూన్, సూరత్‌, అహ్మదాబాద్‌, సిల్వాస, నాగ్‌పూర్‌లలో బస్సుల్ని నిర్వహిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 28, 2022 08:57 PM