Free Ola Scooter: ఫ్రీ గా స్కూటర్ కావాల నాయనా… అయితే ఈ బంపరాఫర్ మీకోసమే..
ఓలా స్కూటర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. గొప్ప శ్రేణి, శక్తివంతమైన ఫీచర్లు, అందమైన రంగులతో అందుబాటులో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
ఓలా స్కూటర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. గొప్ప శ్రేణి, శక్తివంతమైన ఫీచర్లు, అందమైన రంగులతో అందుబాటులో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా ఎలక్ట్రిక్ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభించింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఓలా స్కూటర్‌ను ఉచితంగా గెలుచుకునేందుకు ఒక ఆఫర్ ప్రకటించారు. మీరు కూడా ఓలా స్కూటర్‌ను ఉచితంగా పొందాలనుకుంటే.. దాని కోసం ఒక పని చేయాలి. అదేంటంటే..ఓలా స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్లు నడపాల్సి ఉంటుంది. ఇందులో గెలిచినవారికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇస్తారు. ఈ ఆఫర్ కింద మెుత్తం 10 ఓలా స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు ఈ ఛాలెంజ్‌ని విజయవంతంగా పూర్తి చేసి, ఈ స్కూటర్‌ను గెలుచుకున్నారు. ఈ ఛాలెంజ్ కింద ఇంకా 8 స్కూటర్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు భవిష్ మరో 10 మంది కస్టమర్లకు ఓలా స్కూటర్‌ను ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారు. అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఓలా కొనుగోలు విండో మే 21 నుంచి తిరిగి తెరిచింది. Ola S1, S1 ప్రో మోడళ్లను ఈ విండో కింద కంపెనీ అమ్ముతోంది. కస్టమర్లు తమ ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధరను 10,000 మేర కంపెనీ పెంచింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 181 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

