Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

కృషి, పట్టుదల ఉంటే.. లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.. ఉన్నతంగా ఎదగవచ్చు అని పెద్దలు అంటుంటారు.. అలానే ఓ బుడతడు పడుతున్న కష్టాన్ని చూసి.. అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా..

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

|

Updated on: May 26, 2022 | 9:44 AM


కృషి, పట్టుదల ఉంటే.. లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.. ఉన్నతంగా ఎదగవచ్చు అని పెద్దలు అంటుంటారు.. అలానే ఓ బుడతడు పడుతున్న కష్టాన్ని చూసి.. అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా.. పిల్ల వాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ పిల్లవాడు రోడ్డు పక్కన ఉన్న బండిపై చైనీస్ ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగం చెందుతున్నారు అలాగే ఆ చిన్నారి ట్యాలెంట్‌ను.. తెగ మెచ్చుకుంటున్నారు. చదువుకునే వయసులో కుటుంబభారాన్ని మోస్తున్న ఈ చిన్నారి అంకితభావం చూసి ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నిండా ఐదేళ్లయినా ఉన్నాయో లేదో.. ఆ కుర్రాడికి స్టవ్‌ కూడా అందడం లేదు. అయినా ఒక చెక్క స్టూలుపైన నిలబడి మహవాటంగా గరిట తిప్పుతున్నాడు. ఒక పెద్ద పెనం మీద ఎంతో చాకచక్యంగా చాట్‌ తయారు చేస్తున్నాడు. ఈ చిన్నారి వీడియో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ.. చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కస్టమర్‌ల కోసం ఈ పిల్లవాడు పూర్తిగా వంటపైనే ఫోకస్ చేసి చైనీస్ ఫుడ్‌ను సిద్ధం చేస్తున్నాడు. చిన్నారికి సంబంధించిన ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌ అయింది. లక్షలాది మంది వీక్షించడమే కాదు.. లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ బుడతడిపై దేవుడు దయ చూపాలంటూ కామెంట్లు చేస్తూ ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us