Rare Surgery: షాకింగ్.. 13ఏళ్ల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి..ఎండోస్కోపిలో బయటపడ్డ నిజం

గత కొన్ని రోజులుగా ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. గత ఏడాదికి పైగా ఆ బాలికను కడుపునొప్పి వేధిస్తోంది. తరచూ భరించలేని కడుపునొప్పితో బాలిక తల్లడిల్లిపోయేది. బాలిక బాధను చూసిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిప్పారు.

Rare Surgery: షాకింగ్.. 13ఏళ్ల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి..ఎండోస్కోపిలో బయటపడ్డ నిజం
Rare Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: May 28, 2022 | 8:13 PM

గత కొన్ని రోజులుగా ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. గత ఏడాదికి పైగా ఆ బాలికను కడుపునొప్పి వేధిస్తోంది. తరచూ భరించలేని కడుపునొప్పితో బాలిక తల్లడిల్లిపోయేది. బాలిక బాధను చూసిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిప్పారు. ఎందరో వైద్యులకు చూపించారు. అనేక రకాల మందులు వాడారు. అయినప్పటికీ బాలికను వేధిస్తున్న కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఆఖరుకు విశాఖ విమ్స్ కు చేరారు. చిన్నారి తల్లిదండ్రులు. అన్ని టెస్టులు నిర్వహించిన వైద్య సిబ్బంది షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. దాంతో తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. అదేలా సాధ్యమని అంతా నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఆ పాపకు వచ్చిన సమస్య ఏంటీ..? ఎందుకు వైద్యులు, తల్లిదండ్రులు షాక్‌ అవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే,..

ఏపీలోని రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల చిన్నారి గత ఏడాది కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏం తిన్నా, తాగినా వాంతులవుతుండటం, అజీర్తి సమస్యలతో తల్లడిల్లుతోంది. వల్ల స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ తీసి పరిక్షించారు. ఎలాంటి రోగ లక్షణాలు గుర్తించకపోవటం వల్ల ఇంటికి పంపించారు. మళ్లీ ఇంటికి వచ్చాక పరిస్థితి ఎప్పటిలా మారింది. రోజురోజుకీ ఆరోగ్యం క్షిణిస్తుండటాన్ని చూసి… అనేక ఆస్పత్రులు తిప్పారు. ఎందరో వైద్యులను ఆశ్రయించారు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మాత్రం కడుపునొప్పి భరించలేకపోతోంది. చివరకు వారి బంధువుల ద్వారా విశాఖ విమ్స్‌ వైద్యులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రులు. అనుమానంతో ఆమెకు ఎండోస్కోపి నిర్వహించగా…. అసలు విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి

ఆ బాలిక కడుపులో వెంట్రుకలున్నట్లుగా గుర్తించారు. సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా… తల్లిదండ్రులు అంగీకరించారు. కడుపులో పోగైన వెంట్రుకల ముద్దను… గ్యాస్టరస్టమి విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి బయటకు తీశారు. ఇలా బయటపడ్డ వెంట్రుకలు దాదాపు 300గ్రాముల బరువున్నట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం బాలిక ఆరోగ్యం బాగానే ఉన్నట్లు విమ్స్‌ డైరెక్టర్‌ రాంబాబు తెలిపారు.