SVRR Jobs: తిరుపతి సర్వజన వైద్యశాలలో ఉద్యోగాలు.. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
SVRR Jobs: తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం అకడమిక్‌లో చూపిన ప్రతిభ, పని అనుభవం ఆధారంగా...
SVRR Jobs: తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం అకడమిక్‌లో చూపిన ప్రతిభ, పని అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయే విభాగాల్లో ఖాళీల ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ (01), ఫార్మాసిస్ట్ (01), స్ర్టెచర్ బేరర్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు దరఖాస్తులను సూపరింటెండెంట్, ఎస్వీఆర్‌ఆర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, తిరుపతి అడ్రస్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్ మార్కులు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 01-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..