Walk To School: దేశంలో 48 శాతం మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలకు.. సర్వేలో కీలక విషయాలు

Walk To School: మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48 శాతం మంది విద్యార్థులకు కాలినడకన వెళ్తున్నట్లు గత సంవత్సరం నిర్వహంచిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (NAS)-2021లో..

Walk To School: దేశంలో 48 శాతం మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలకు.. సర్వేలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2022 | 11:34 AM

Walk To School: మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48 శాతం మంది విద్యార్థులకు కాలినడకన వెళ్తున్నట్లు గత సంవత్సరం నిర్వహంచిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (NAS)-2021లో స్పష్టమైంది. పాఠశాల బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం, 8 శాతం మంది విద్యార్థులు సొంత వాహనాల్లో పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. 65 శాతం మంది ఉపాధ్యాయులపై ఎక్కువ పనిభారం పడుతున్నట్టు వెల్లడైంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తితో ఉన్నట్టు 97 శాతం మంది ఉపాధ్యాయులు తెలినట్లు వివరించిది. విద్యార్థుల హోం వర్క్‌, ఇతరత్రా అంశాలపై వారి తల్లిదండ్రుల నుంచి సరైన సహకారం అందడం లేదని 25 శాతం పాఠశాల యాజమాన్యాలు పేర్కొన్నట్టు తెలిపింది. కేంద్ర సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధా నం చర్చలో కేవలం 58 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొన్నట్టు తెలిపింది.

ఇక దేశ వ్యాప్తంగా గత సంవత్సరం నవంబర్‌ 12న నిర్వహించిన ఈ సర్వేలో 720 జిల్లాల్లోని లక్షా 18 వల పాఠశాలల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో 3, 5, 8, 10వ తరగతికి చెందిన మొత్తం 34 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు వెళ్తున్నట్లు తేలింది. ఇక చదువుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులు ఏవిధంగా నిలవాలో 87శాతం పాఠశాలలు చెబుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వారిలో 25శాతం మంది విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి సరైన మద్దతు లేని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి