Credit Card: క్రెడిట్‌ కార్డులో చిరునామా, మొబైల్‌ నంబర్‌ను మార్చలా..? సింపుల్‌.. ఇలా చేయడం..!

Credit Card Mobile Number, Adderess Change: సొంత ఇల్లు లేనివారు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించుకుంటారు. అద్దె ఇళ్లల్లో ఉండే వారు అప్పుడప్పుడు ఇల్లు..

Credit Card: క్రెడిట్‌ కార్డులో చిరునామా, మొబైల్‌ నంబర్‌ను మార్చలా..? సింపుల్‌.. ఇలా చేయడం..!
Follow us

|

Updated on: May 27, 2022 | 9:12 PM

Credit Card Mobile Number, Adderess Change: సొంత ఇల్లు లేనివారు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించుకుంటారు. అద్దె ఇళ్లల్లో ఉండే వారు అప్పుడప్పుడు ఇల్లు మారుతుంటారు. అలాంటి సమయంలో ఇంటి చిరునామా మారుతుంటుంది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు తీసుకునేవారు ఆధార్‌లో ఉన్న చిరునామాతో పాటు ప్రస్తుతం ఉంటున్న చిరునామా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం క్రెడిట్ కార్డుపై మన వివరాలన్నీ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ తప్పనిసరిగా అప్‌డేడ్‌ చేయాలి. బ్యాంకు నుంచి కూడా పదేపదే మెసేజ్‌లు వస్తుంటాయి. చిరునామా అప్‌డేట్‌ చేసే అడ్రస్‌ పత్రాలు పంపాల్సి ఉంటుంది. చిరునామా మార్చకుంటే సంబంధిత స్టేట్‌మెంట్లు వేరే వాళ్ల చేతిలో వెళ్లిపోతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఇల్లు మారగానే ఆడ్రస్‌ కూడా మార్చడం తప్పనిసరి.

మన సిమ్ కార్డుకు వేరెవరిదో క్రెడిట్ కార్డుకు సంబంధించిన, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారం వస్తుంటుంది. లేదా మన అడ్రస్‌కు గతంలో ఇంటి అద్దెకు ఉన్నవారి స్టేట్‌ మెంట్స్‌ వస్తుంటాయి. అందుకే మనం ఇల్లు మారినప్పుడు, ఫోన్ నెంబరు మార్చినప్పుడు క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి. మరి అలాంటి సమయంలో ఫోన్‌ నంబర్‌, చిరునామా మార్చడం ఎలానో తెలుసుకుందాం.

ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నెంబర్ మార్చడం ఎలా..?

ఇవి కూడా చదవండి

☛ బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి.

☛  అక్కడ మై ప్రొఫెల్ సెక్షన్‌లో కాంటాక్ట్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి.

☛ ఈ సెక్షన్‌లో మీరు మొబైల్ నెంబరు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

☛ మీ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ నెంబరును నమోదు చేసి సబ్మిట్‌ చేయగానే మా నంబర్‌ మారినట్లు మీ మొబైల్‌కు సందేశం వస్తుంది.

☛ అలాగే ఈ మెయిల్ ఐడీని మార్చడం కూడా ఇదే పద్దతిలోనే ఉంటుంది.

ఇంటి అడ్రస్‌ను మార్చడం ఎలా..?

☛ మై ప్రొఫైల్ సెక్షన్‌లోనే సర్వీసెస్ అనే ట్యాబ్ లేదా ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్‌ చేయగానే ఓ కొత్త పేజీకి తీసుకెళ్లుతుంది. అక్కడ మీరు మీ కొత్త చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుంది.

☛ అడ్రస్‌కు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

☛ అడ్రస్ ప్రూఫ్‌గా ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మొబైల్ బిల్లు, గ్యాస్ బిల్లులలో ఏదో ఒకటి అప్‌లోడ్ చేయవచ్చు.

☛ అనంతరం ఓటీపీ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

☛ ఇవన్ని చేసిన తర్వాత బ్యాంక్ మీ అభ్యర్థనను రెండు మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.

మొబైల్ యాప్ ద్వారా చేయడం ఇలా..?

☛ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ మార్చుకోవాలంటే మై ప్రొఫైల్ సెక్షన్ వెళ్లి ఎడిట్ ఆప్షన్ నొక్కి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ మార్చాలి.

☛ మీ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవచ్చు.

☛ ఇదే రీతిలో అడ్రస్ కూడా అప్ ‌డేట్ చేసి అడ్రస్ ప్రూఫ్ అప్ ‌లోడ్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి