AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tablet: ఈ 4 టాబ్లెట్‌లు రూ.10,000 కంటే తక్కువ ధరలో లభిస్తాయి.. అవేంటంటే..?

Tablet: పిల్లల విద్య నుంచి వృద్ధుల వినోదం వరకు పెద్ద స్క్రీన్‌తో కూడిన టాబ్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లోని వైఫై లేదా మొబైల్ హాట్ స్పాట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా

Tablet: ఈ 4 టాబ్లెట్‌లు రూ.10,000 కంటే తక్కువ ధరలో లభిస్తాయి.. అవేంటంటే..?
Tablet
uppula Raju
|

Updated on: May 27, 2022 | 12:30 PM

Share

Tablet: పిల్లల విద్య నుంచి వృద్ధుల వినోదం వరకు పెద్ద స్క్రీన్‌తో కూడిన టాబ్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లోని వైఫై లేదా మొబైల్ హాట్ స్పాట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. మీరు కొత్త టాబ్లెట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే 4 టాబ్లెట్ ఎంపికల ఉత్తమమని చెప్పవచ్చు. అంతేకాదు వీటి ధర కూడా రూ.10,000 కంటే తక్కువే. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. శామ్సంగ్ టాబ్లెట్

మీరు ఫ్లిప్‌ కార్ట్ నుంచి శామ్సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఏ 8.0ని రూ.9999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే వినియోగదారులు 512 GB వరకు SD కార్డ్‌ను ఇందులో చేర్చవచ్చు. దీనిలో 7.99 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. అలాగే ఇది 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 9.0లో పని చేస్తుంది. 5100 mAh బ్యాటరీ సెటప్‌ కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

2. లెనోవో టాబ్లెట్

ఈ లెనోవో టాబ్లెట్ 2 GB RAM, 32 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 8-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది వెనుక ప్యానెల్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 2-మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ టాబ్లెట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో సింగిల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీని సహాయంతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

3. మోటరోలో ట్యాబ్‌

మోటరోలో G20 టాబ్లెట్ 3 GB RAM, 32 GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో వినియోగదారులు మెమరీని పెంచడానికి మైక్రో SD కార్డ్‌ను ఉపయోగించవచ్చు. దీని వెనుక ప్యానెల్‌లో 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 5100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11లో పని చేస్తుంది.

4. ఆల్కాటెల్ టాబ్లెట్‌

మీరు ఆల్కాటెల్‌ టాబ్లెట్‌ను రూ.9499కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB RAM, 32 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 8-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4080 mAh బ్యాటరీతో నడుస్తుంది. వాయిస్ కాల్స్ కోసం సింగిల్ SIMకి మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్‌లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!