RBI Report: తగ్గుముఖం పడుతున్న 2000 రూపాయల నోట్ల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌

RBI Report: రానున్న కాలంలో మార్కెట్‌లో ఎక్కడ వెతికినా 2000 నోట్లు దొరకని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దేశంలో చలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ కలిగిన నోటు సంఖ్య క్రమ..

RBI Report: తగ్గుముఖం పడుతున్న 2000 రూపాయల నోట్ల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌
Follow us

|

Updated on: May 27, 2022 | 7:24 PM

RBI Report: రానున్న కాలంలో మార్కెట్‌లో ఎక్కడ వెతికినా 2000 నోట్లు దొరకని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దేశంలో చలామణిలో ఉన్న ఈ అత్యధిక విలువ కలిగిన నోటు సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది. రిజర్వ్ బ్యాంక్ ( RBI ) వార్షిక నివేదిక ప్రకారం.. చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు మొత్తం విలువలో ప్రస్తుతం 13.8 శాతంగా ఉంది. దీని విలువ గత సంవత్సరం 17.3 శాతంగా ఉండేది. అంటే ఏడాదిలో 2000 రూపాయల నోట్ల సంఖ్య 17 శాతం నుండి 14 శాతానికి తగ్గింది. నిజానికి కొత్త 2000 నోట్ల ముద్రణ కొంత కాలంగా నిలిచిపోయింది. అదే సమయంలో ఇతర నోట్ల ముద్రణ నిరంతరం కొనసాగుతోంది. దీంతో చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య పెరుగుతుండగా, 2000 నోట్లు మాత్రం నిలిచిపోవడంతో షేర్లలో క్షీణత నెలకొంది. రానున్న కాలంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. గత ఏడాది ఈ సర్క్యులేషన్ 12,437 కోట్లుగా ఉంది. మార్చి 2020 చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉంది. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతంగా ఉంది. మార్చి 2021 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే మొత్తం నోట్ల సంఖ్యలో 2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు తగ్గింది. అంటే మొత్తం నోట్లలో 1.6 మాత్రమే ఉన్నాయి. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్ నోట్లు చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. ఇక సంఖ్యాపరంగారూ. 500 డినామినేషన్ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోట్లు మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో 21.3 శాతంగా ఉన్నాయి’ అని ఆర్బీఐ 2021 వార్షిక నివేదిక వెల్లడించింది.

రూ. 500 డినామినేషన్ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం, మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉన్నాయి. విలువ పరంగా ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి రూ. 28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 31.05 లక్షల కోట్లకు పెరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలో తెలిపింది. విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా మార్చి 31, 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతంగా ఉంది. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతంగా ఉంది అని నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి

అన్ని నోట్లలో గరిష్టంగా 500 నోట్లు:

ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న అన్ని నోట్లలో గరిష్టంగా 500 నోట్లే ఉన్నాయి. మొత్తం నోట్లలో దాదాపు 35 శాతం నోట్లు 500 రూపాయలు కాగా, 21 శాతం నోట్లు 10 రూపాయలు. 2016 నవంబర్‌లో ప్రభుత్వం 500, 1000 నోట్లను నిలిపివేయడంతో 2000 నోట్లను ప్రవేశపెట్టారు. తర్వాత కొత్త 500 నోట్లను ముద్రించినా 1000 నోట్లను పూర్తిగా నిలిపివేశారు. అయితే కాలక్రమేణా 2000 నోట్ల ముద్రణ కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం చాలా వరకు 500 డినామినేషన్లలో మాత్రమే నోట్లు ముద్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో మార్కెట్‌లో 2000 నోట్లు తక్కువగా కనిపించే అవకాశం ఉంది.

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..