AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Pe: ఫోన్-పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. గోల్డ్ SIP అందుబాటులోకి.. కేవలం రూ.100 నుంచి..

Phone Pe: ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక అందరూ వినియోగిస్తున్నారు. చెల్లింపుల సంస్థ ఈ తరుణంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను తన వినియోగదారులకు చేరువచేస్తోంది.

Phone Pe: ఫోన్-పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. గోల్డ్ SIP అందుబాటులోకి.. కేవలం రూ.100 నుంచి..
Gold
Ayyappa Mamidi
|

Updated on: May 27, 2022 | 7:51 PM

Share

Phone Pe: ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక అందరూ వినియోగిస్తున్నారు. చెల్లింపుల సంస్థ ఈ తరుణంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను తన వినియోగదారులకు చేరువచేస్తోంది. అందులోనూ భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం పెట్టుబడుల విషయంలో మంచి శుభవార్త చెప్పింది. అదేంటంటే ఫోన్- పే ద్వారా ఇకపై వినియోగదారులు సిప్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటును కల్పించింది. దీని ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని ఇంటి వద్ద కూర్చునే కొంత మెుత్తంలో సొమ్ము పెట్టుబడి పెట్టడం ద్వారా పొందవచ్చు. వినియోగదారులు పెట్టుబడికి సమానమైన విలువ గల బంగారాన్ని ఎంఎంటీసీ- పీఏఎంపీ, సేఫ్ గోల్డ్ నిర్వహిస్తున్న బ్యాంక్‌-గ్రేడ్ లాక‌ర్లలో భ‌ద్రప‌రుస్తారు.

తాజాగా తెచ్చిన ఈ సదుపాయం వల్ల వినియోగదారులు కేవలం రూ.100 నుంచి తమ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీనికి తోడు ప్రతి రోజు బంగారం ధరలను ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. ఇలా చిన్న మెుత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రేటుకు బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా చెల్లింపు చేసినదానికి గాను సమకూరిన బంగారాన్ని వినియోగదారులు ఎప్పుడైనా విక్రయించవచ్చు లేదా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్, బార్స్ రూపంలో ఎప్పుడైనా ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ఫోన్ పే యాప్ లో గోల్డ్ సిప్ ఆప్షన్ ఎంచుకొని.. ఆ తరువాత నెలవారీ చెల్లించాలో ఎంచుకోవాలి. ఆపై సిప్ కాలం(సంవత్సరాలు), తేదీ సెలెక్ట్ చేసుకుంటే తరువాత ఆ డబ్బు ప్రతి నెల అకౌంట్ నుంచి ఆటోమెటిక్ గా కట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు