Radhakishan Damani: ఆవిరైన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సంపద.. ఏడాదిలోనే ఎందుకంటే..

Radhakishan Damani: అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ(డీమార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ సంపద 2022 క్యాలెండర్ సంవత్సరంలో భారీగా తగ్గింది. కేవలం ఏడాది కాలంలో నాలుగోవంతు మేర సంపద కరిగిపోయింది.

Radhakishan Damani: ఆవిరైన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సంపద.. ఏడాదిలోనే ఎందుకంటే..
Radakishan Damani
Follow us

|

Updated on: May 27, 2022 | 2:40 PM

Radhakishan Damani: అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ(డీమార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ సంపద 2022 క్యాలెండర్ సంవత్సరంలో భారీగా తగ్గింది. మార్చి 31, 2022 నాటికి దమానీకి 14 లిస్టెడ్ కంపెనీల్లో 1 శాతం వాటా ఉంది. వీటి విలువ ఇప్పుడు దాదాపు రూ.1.55 లక్షల కోట్లుగా ఉంది. అయితే.. 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభం సంపదతో పోలిస్తే ప్రస్తుతం 23 శాతం తక్కువకు చేరుకుంది. డిసెంబర్ 31, 2021 నాటికి దమానీ సంపద రూ.2.02 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం అది రూ.1.55 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే దాదాపుగా నాలుగో వంతు సంపద ఆవిరైంది.

రాధాకిషన్ దమానీ పెట్టుబడి పెట్టిన ఇండియా సిమెంట్స్, ట్రెంట్, యునైటెడ్ బ్రూవరీస్, సుందరం ఫైనాన్స్, 3ఎమ్ ఇండియా, మెట్రోపోలిస్ హెల్త్ కేర్, బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, అస్టా మైక్రోవేవ్, మంగళం ఆర్గానిక్స్ తో పాటు ఇతర పెట్టుబడుల విలువ భారీగా పతనం కావటమే దమాని ఆస్తుల విలువ క్షీణతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 54,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు 420 పాయింట్ల లాభంతో ఆరంభమైంది. అయితే.. కాసేపటికి భారీ లాభాల నుంచి స్వల్ప లాభాల్లోకి మార్కెట్లు జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా టెక్ స్టాక్స్‌లో కొనుగోళ్లు నమోదయ్యాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి