Alert Farmers: రైతులకి అలర్ట్.. కేవైసీ అస్సలు మరిచిపోవద్దు.. లేదంటే చాలా నష్టం..!
Alert Farmers: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం రైతులు ఈ కేవైసీ అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ మే 31, 2022గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలోని
Alert Farmers: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం రైతులు ఈ కేవైసీ అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ మే 31, 2022గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలోని రైతులకు సంవత్సరానికి మూడుసార్లు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని కోసం రైతులు తమ ఈ కేవైసీని అప్‌డేట్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పథకం కింద 11వ విడత 2000 రూపాయలను ఈ నెల చివరి తేదీ అంటే మే 31వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే అంతకంటే ముందు రైతులు తమఈ కేవైసీని 31లోపు అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి.
పథకం ప్రయోజనం కోసం ఈ కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ పోర్టల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందడానికి ఈ కేవైసీ చేయడం తప్పనిసరి. ఈ పథకం కింద వచ్చే రైతులు ఇంకా కేవైసీని అప్‌డేట్ చేసుకోకుంటే వెంటనే చేసుకోవాలి. లేదంటే పదకొండో ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2000 మీ ఖాతాలో జమకావు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ కేవైసీ అప్‌డేట్ చేసేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఆన్‌లైన్‌లో ఈ కేవైసీ చేయడం ఎలా..?
1. ముందుగా మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. తర్వాత పేజీకి కుడివైపున కనిపించే eKYCపై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి.
4. తర్వాత ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
5. ఇప్పుడు గెట్ OTPపై క్లిక్ చేసి OTP వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేయండి.
ఆఫ్‌లైన్‌లో ఈ కేవైసీ చేయడం ఎలా..?
1. పీఎం కిసాన్ యోజన కింద ఆఫ్‌లైన్ eKYCని అప్‌డేట్ చేయడానికి మీరు సమీపంలోని CSCకి వెళ్లాలి.
2. అక్కడ పీఎం కిసాన్ ఖాతాలో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.
3. తర్వాత బయోమెట్రిక్ ద్వారా ఖాతాకు లాగిన్ అవ్వాలి.
4. ఇప్పుడు మీ ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేసి ఫారమ్‌ను సమర్పించాలి.
5. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీ మొబైల్ ఫోన్‌లో కేవైసీ అప్‌డేట్ అయినట్లు మెస్సేజ్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి