వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఆ ధరలు.. జూన్ 1 నుంచే..

మోటారు వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచేందుకు ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఆ ధరలు.. జూన్ 1 నుంచే..
Follow us

|

Updated on: May 27, 2022 | 11:25 AM

వచ్చే నెల అంటే జూన్ 1 నుంచి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతోపాటు ఇతర భారీ వాహనాల థర్డ్ పార్టీ బీమా ఖరీదు కానుంది. అంటే, ప్రస్తుతం మీరు థర్డ్ పార్టీ బీమా కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచేందుకు ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 1 నుంచి థర్డ్ పార్టీ బీమా కోసం ఎంత మొత్తం చెల్లించాలంటే?

నాలుగు చక్రాల వాహనాలకు: ప్రతిపాదిత సవరించిన ధరల ప్రకారం 1,000 సీసీ ప్రైవేట్ కార్లకు రూ. 2,072లకు బదులుగా రూ. 2,094లకు వరకు వర్తిస్తుంది. అదేవిధంగా, 1,000 సీసీ నుంచి 1,500 సీసీ వరకు ఉన్న ప్రైవేట్ కార్లు రూ.3,221లకు బదులుగా రూ.3,416ల వరకు ఉండనుంది. అయితే 1,500 సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్ల యజమానులు రూ. 7,890లకు బదులుగా రూ. 7,897ల ప్రీమియం చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ద్విచక్ర వాహనాలకు : ద్విచక్రవాహనాల విషయానికొస్తే, 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య వాహనాలకు ప్రీమియం రూ. 1,366లు, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ ఉన్న వాహనాలకు ప్రీమియం రూ. 2,804గా ఉండనుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై..

ఇక ఎలక్ట్రిక్ వాహానాల విషయానికి వస్తే.. ప్రీమియం 30 kW వరకు కొత్త ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) కోసం మూడు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ. 5,543. 30 లు ఉండనుంది. 65 కిలోవాట్లు ఎక్కువ సామర్థ్యం ఉన్న ఈవీలకు రూ.9,044గా ఉండనుంది. భారీ EVల కోసం మూడేళ్ల ప్రీమియం రూ. 20,907గా ఉండనుంది.

3 kW వరకు కొత్త ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ. 2,466గా పేర్కొన్నారు. అదేవిధంగా, 3 నుంచి 7 కిలోవాట్ల వరకు ద్విచక్ర EV వాహనాలకు ప్రీమియం రూ. 3,273లుకాగా, 7 నుంచి 16 kW వాహనాలకు ప్రీమియం రూ. 6,260గా ఉండనుంది. అధిక సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల ప్రీమియం రూ.12,849గా నిర్ణయించారు.

మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పార్టీ అంటే వాహన యజమాని, రెండవ పార్టీ అంటే వాహనం డ్రైవర్, ఇక మూడవ పార్టీ అంటే ప్రమాదంలో బాధితులయ్యేవారు. బహిరంగ ప్రదేశంలో మోటారు వాహనాన్ని ఉపయోగించినప్పుడు వాహనం వల్ల ప్రమాదం సంభవించి, మూడవ పక్షానికి ప్రాణం లేదా ఆస్తి నష్టం జరిగితే, వాహన యజమాని, దాని డ్రైవర్ ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో, బీమా కంపెనీలు ఆర్థిక పరిహారాన్ని భర్తీ చేయడానికి థర్డ్ పార్టీ బీమాను అందిస్తుంటాయి. బీమా విషయంలో, సంబంధిత బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని చెల్లిస్తుంది.