- Telugu News Photo Gallery Cricket photos Women t20 challenge Velocity player kiran navgire score fastest fifty in the tournament velocity vs trailblazers
Women T20 Challenge: 5 ఫోర్లు, 5 సిక్సులతో 202 స్ట్రైక్‌రేట్.. తొలి మ్యాచ్‌లోనే భీభత్సం.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డులు బ్రేక్..
మహిళల టీ20 ఛాలెంజ్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం ఈ బ్యాట్స్‌మెన్‌కు దక్కగా, కసిగా బ్యాగింగ్ చేసి బౌలర్ల భరతం పట్టింది.
Updated on: May 27, 2022 | 9:36 AM

మహిళల T20 ఛాలెంజ్‌లోని రెండు ఫైనలిస్ట్ జట్లను నిర్ణయించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్‌నోవాస్, దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ టీంలు రెండూ ఫైనల్ ఆడనున్నాయి. గురువారం స్మృతి మంధాన సారథ్యంలోని ట్రైల్‌బ్లేజర్స్‌తో వెలాసిటీ జట్టు ఓడిపోయింది. అయితే ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. 191 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. కేవలం 174 పరుగులు చేసి, ఓటమిపాలైంది. ఇందులో ఆ జట్టు ఆల్‌రౌండర్ కిరణ్ నవ్‌గిరే కీలక పాత్ర పోషించి, బ్యాట్‌తో తుఫాన్ బ్యాటింగ్‌తో రికార్డు కూడా సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో కిరణ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 34 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో, ఈ బ్యాట్స్‌మన్ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టింది. ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన అర్థసెంచరీగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన రికార్డు నెలకొల్పిన షెఫాలీ వర్మను వెనక్కి నెట్టింది.

14వ ఓవర్ ఐదో బంతికి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి, తర్వాతి బంతికి కూడా సిక్సర్ కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేసింది. కిరణ్ తొలిసారి ఈ టోర్నీలో ఆడుతుంది. సూపర్‌నోవాస్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్ చేయలేదు. ఆమె వెలాసిటీకి వ్యతిరేకంగా మొదటిసారి ఆడుతోంది. మొదటిసారి ఆమె తన భీకర ఫామ్‌ను చూపిస్తూ రికార్డు సృష్టించింది.

మ్యాచ్ అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌లో అవకాశం రాకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. "గత మ్యాచ్‌లో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎగువ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుందని ఆశించాను. నా శక్తికి తగ్గట్టుగా ఆడాలని అనుకున్నాను" అని పేర్కొంది.

వెలాసిటీ 191 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 16 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ట్రైల్‌బ్లేజర్స్ కోసం ఎస్. మేఘన, జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి బలమైన స్కోరు అందించారు. ట్రైల్‌బ్లేజర్స్ 190 పరుగులు చేయడం ఈ టోర్నీలో అత్యధిక స్కోరుగా నిలిచింది. మేఘన 73, రోడ్రిగ్స్ 66 పరుగులు చేశారు.





























