Stock Market: వారాంతంలో పాజిటివ్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలను ముందుకు నడిపించిన IT షేర్లు..
Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌లు నిఫ్టీ- 50, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడడంతో భారతీయ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజును పాజిటివ్ నోట్‌తో ముగిశాయి.
Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌లు నిఫ్టీ- 50, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడడంతో భారతీయ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజును పాజిటివ్ నోట్‌తో ముగిశాయి. రెండో రోజు ర్యాలీని కొనసాగిస్తూ నిఫ్టీ సూచీ 16,300 పాయింట్లపైన ముగిసింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడి 54,900 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ర్యాలీకి ఎక్కువగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లు దోహదపడ్డాయి. నిఫ్టీ ఐటీ దాదాపు 2.5% లాభపడగా, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఈ రోజు దాదాపు 1.7 శాతం పెరిగింది. నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ ఒక శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్ ఫ్లాట్‌గా ముగియటంతో మెటల్ ఇండెక్స్ కూడా కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.
గ్లోబల్ ర్యాలీలో చేరడం, USలో అనుకూలమైన రిటైల్ ఆదాయాలను అనుసరించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మార్కెట్లను ముందుకు నడిపాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం కూడా దేశీయ మార్కెట్‌కు ఓదార్పునిచ్చిందని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. RBI రానున్న పాలసీ సమావేశం మార్కెట్లో కీలకమైన అంశంగా మారనుంది. ఈ సారి రేట్ల పెంపు దాదాపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ కీలక సంకేతాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత రేట్ల పెంపు ఉంటుందని చెప్పకనే చెప్పారు.
ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ దాదాపు 1.3% చొప్పున పెరిగాయి. దీనికి ఇండియా విక్స్ సూచీ తగ్గుముఖం పట్టడం కూడా కారణంగా తెలుస్తోంది. స్టాక్‌లలో.. అపోలో హాస్పిటల్స్ దాదాపు ఐదు శాతం లాభంతో నిఫ్టీని నడిపించాయి. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా నాలుగు శాతంతో అత్యధికంగా లాభంతో క్లోజ్ అయింది. దీనికి తోడు ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, విప్రో ఇన్ఫోసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్ లాభపడ్డ షేర్లలో ఉన్నాయి. పాజిటివ్ మార్కెట్‌లో క్షీణించిన షేర్లలో గ్యాస్ అండ్ మెటల్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. వారం చివరి రోజున ఒఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పోవ్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఆర్‌ఐఎల్ ప్రముఖంగా నష్టాలతో ముగిశాయి.