Airtel Smart Recharge Plan: ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.99ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు
Airtel Smart Recharge Plan:దేశంలోని టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్ష్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.99 విలువైన..
Airtel Smart Recharge Plan:దేశంలోని టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్ష్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.99 విలువైన స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. కొత్త ‘స్మార్ట్ రీఛార్జ్’ ప్లాన్, ఎయిర్‌టెల్ సిమ్‌లను సెకండరీ సిమ్‌గా ఉపయోగిస్తుంటే వాటిని యాక్టివ్‌గా ఉంచడానికి రూపొందించబడింది.
రూ. 99 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు:
తమ ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ సిమ్‌గా ఉపయోగిస్తున్న వారికి, దానిని ఎక్కువగా ఉపయోగించకుండా చాలా కాలం పాటు యాక్టివ్‌గా ఉండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ సహాయపడుతుంది. ఎయిర్‌టెల్ నుండి ఈ సరసమైన ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. తక్కువ బడ్జెట్ ప్లాన్ కోసం చూస్తున్న వ్యక్తులు కూడా ఈ ప్లాన్‌ను ఉపయోగించవచ్చు.రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ 200MB డేటా, రూ.99 విలువైన టాక్-టైమ్ లభిస్తుంది. అలాగే సెకనుకు 1 పైసా చొప్పున వసూలు చేసే లోకల్ టారిఫ్ కాల్‌లను అందిస్తుంది. స్థానికంగా ఉన్నవారికి SMS కోసం రూ. 1 ఖర్చవుతుంది. STD SMS కోసం Airtel రూ. 1.5/పైసలను వసూలు చేస్తోంది.
ఇంతకుముందు ఎయిర్‌టెల్ నుండి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ రూ.79 ఉంటే నవంబర్ 2021లో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచినప్పుడు కంపెనీ అదే ప్లాన్ ధరను రూ.79 ప్లాన్ నుండి రూ.99కి మార్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి