AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digilocker: వాట్సాప్‌లో డిజిలాకర్.. ఒక్క మెసేజ్‌తో ఆ సేవలన్నీ అందుబాటులోకి..

MyGov Helpdesk: మీ డిజి లాకర్‌ని ఇంట్లో మరచిపోయినట్లయితే, వాట్సాప్‌లో డీఎల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను చూపించడం ద్వారా..

Digilocker: వాట్సాప్‌లో డిజిలాకర్.. ఒక్క మెసేజ్‌తో ఆ సేవలన్నీ అందుబాటులోకి..
Whatsapp Digilocker
Venkata Chari
|

Updated on: May 25, 2022 | 7:04 AM

Share

WhatsApp: యూజర్లకు ఎప్పటికప్పుడు ఎన్నో ఫీచర్లను అందిస్తోన్న వాట్సాప్.. మరో ఫీచర్‌ను యాడ్ చేసింది. దీని సహాయంతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించింది. డిజిలాకర్ సేవను ఉపయోగించడానికి ప్రజలు ప్రస్తుతం వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మీరు పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ముఖ్యమైన పత్రాల సాఫ్ట్ కాపీలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లకూడదనుకుంటే, ఈ కొత్త ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే, మీరు అనుకోకుండా మీ డిజి లాకర్‌ని ఇంట్లో మరచిపోయినట్లయితే, వాట్సాప్‌లో డీఎల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను చూపించడం ద్వారా, మీరు చలాన్‌ పడకుండా చూసుకోగలరు.

వాట్సాప్‌లో డిజిలాకర్‌ని ఉపయోగించే పద్ధతి..

1. ముందుగా మీరు ఫోన్‌లో +91 9013151515 నంబర్‌ను సేవ్ చేయాలి. నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత, వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

2. WhatsApp తెరిచిన తర్వాత, ఈ నంబర్‌తో చాట్ బాక్స్‌ను తెరిచి, ఆపై ‘నమస్తే’ లేదా ‘హాయ్’ లేదా ‘డిజిలాకర్’ అని టైప్ చేయడం ద్వారా మెసేజ్ పంపాలి.

3. దీని తర్వాత మీరు COWIN సర్వీస్, డిజిలాకర్ సర్వీస్ అనే రెండు ఎంపికలను పొందుతారు.

4. మీరు డిజిలాకర్ సేవను ఎంచుకున్న వెంటనే, ఆధార్ ధృవీకరణను కోరుతుంది. ఆ వెంటనే మీకు OTP వస్తుంది.

5. ధృవీకరణ తర్వాత, మీ డిజిలాకర్‌లో ఏ పత్రాలు ఉన్నాయో అది మీకు తెలియజేస్తుంది.

6. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్‌తో ఏ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయాలని అనుకుంటున్నారో చెక్ చేసుకుని నమోదు చేయండి. ఆపై మీకు OTP వస్తుంది.

7. OTPని ధృవీకరించిన తర్వాత, మీరు పత్రాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలరు.

మార్చి 2020లో, కోవిడ్ సమయంలో వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ (గతంలో MyGov కరోనా హెల్ప్‌డెస్క్ అని పిలిచారు) ప్రజలకు కోవిడ్‌కి సంబంధించిన సమాచారాన్ని అందించేది. దీంతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను బుక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఇప్పటివరకు, 80 మిలియన్ల మంది ప్రజలు హెల్ప్‌డెస్క్‌కి సభ్యులుగా మారారు. 33 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది టీకా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకున్నారు.