Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు సునీల్. సునీల్ అంటే కామెడీ.. కామెడీ నేటి సునీల్ అనుకునేంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్.

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్
Sunil
Follow us
Rajeev Rayala

|

Updated on: May 25, 2022 | 6:52 AM

స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు సునీల్(Sunil). సునీల్ అంటే కామెడీ.. కామెడీ నేటి సునీల్ అనుకునేంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. ఒకానొకసమయంలో సునీల్ లేకుండా సినిమాలు ఉండేవి కాదు. అదే సమయంలో అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆతర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకూడా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత పూర్తిగా హీరో వేశాలపై దృష్టిపెట్టారు సునీల్. మిస్టర్ పెళ్లి కొడుకు, పూలరంగడు లాంటి సినిమాతో ఆకట్టుకున్నారు సునీల్. అయితే హీరోగా అనుకున్నంతగా రాణించలేక పోయారు. దాంతో తిరిగి కమెడియన్ గా రాణించాలని చూస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే ఇటీవల విలన్ అవతారం కూడా ఎత్తారు సునీల్. రీసెంట్ గా పుష్ప సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి తనలోని కామెడీ యాంగిల్ తో కడుపుబ్బ నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వలో రాబోతున్న సినిమా ఎఫ్ 3. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజులతర్వాత పాత సునీల్ ను చూస్తారని ఇప్పటికే చిత్రయూనిట్ చెప్పుకొస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ పై ప్రశంసలు కురిపించారు సునీల్. సునీల్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 సినిమా కోసం దాదాపు 70 రోజులు పని చేశాను. ఇన్ని రోజుల్లో నేను అనిల్ రావిపూడిని చాలా దగ్గరగా చూశాను. ఆయన కష్టపడే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి ఎవరూ సినిమా తీయలేరు అన్నారు సునీల్.

సెట్లో అనిల్  ఎవరిపైనా  కోప్పడటం నేను చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన ఫ్యామిలీలో మెంబర్ లా చూసుకుంటాడు. అందువలన నేను ఎప్పుడూ  ఆయనతోనే ఉండేవాడిని.. ఆయనతో కలిసే భోజనం చేసేవాడిని. సినిమా షూటింగ్ చేసేటప్పుడు మరో సినిమా షూటింగ్ ఉంది వెళ్ళాలి అంటే కొంతమంది దర్శకులు విసుక్కుంటారు.. కానీ అనిల్ అలా కాదు. వీలైంత త్వరగా నా పార్ట్ కంప్లీట్ చేసి పంపించేసేవాడు.. ఇలా ఆర్టిస్ట్ ను ఇబ్బందిని అర్ధం చేసుకునే దర్శకుడిగా నేను రాఘవేంద్రరావుగారిని చూశాను. ఇప్పుడు అనిల్ రావిపూడిని మాత్రమే చూశాను. షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ లా సరదాగా సాగిపోయింది. అంటూ చెప్పుకొచ్చారు సునీల్.

ఇవి కూడా చదవండి