Nayantara: పెళ్లి పనులు ప్రారంభించిన నయన్.. విగ్నేష్.. కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు..

తంజావూర్ లోని పాపనాశం గ్రామంలో నయనతార తనకు కాబోయే భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ సొంత గ్రామంలో కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..

Nayantara: పెళ్లి పనులు ప్రారంభించిన నయన్.. విగ్నేష్.. కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు..
Nayan
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 08, 2022 | 12:05 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇటీవలే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లితో ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఇక వారి బాటలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సైతం త్వరలోనే ఒకటవ్వబోతున్నారు (Nayantara).. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఓ షోలో పాల్గోన్న నయన్ తన ఉంగరం చూపిస్తూ పరోక్షంగా చెప్పింది. ఇప్పుడు వీరిద్దరు తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి చేసుకోబోయే కళ్యాణ మండపాన్ని కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నయన్, విఘ్నేష్ తమ పెళ్లి పనులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది… వారి కులదైవం ఆలయంలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు..

తంజావూర్ లోని పాపనాశం గ్రామంలో నయనతార తనకు కాబోయే భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ సొంత గ్రామంలో కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. పాపనాశంలోని మేలమరుతరు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లిన నయనతార, విజ్ఞేశ్ శివన్ అమ్మవారికి పొంగలి పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తమ గ్రామానికి సినీ నటి నయనతార రావడంతో ఆలయానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.. జూన్ లేదా ఆగస్టు నెలలో ఇరువురికి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కాతు వాకుల రెండు కాదల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి